Thursday, April 25, 2024

భారత్ లో కొత్తగా 86,508 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

Bharat corona cases total

 

ఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ ధాటికి మహానగరాలు కలవరపడుతున్నాయి. గత 24 గంటల్లో 86,508 కేసులు నమోదుకాగా 1129 మంది మృత్యవాతపడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. భారత్ లో కరోనా కేసులు సంఖ్య 57.32 లక్షలకు చేరుకోగా 91,149 మంది చనిపోయారు. కరోనా నుంచి 46.75 లక్షల మంది కోలుకోగా 9.66 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్రలో (13.63 లక్షలు) తొలి స్థానంలో ఉండగా వరసగా ఆంధ్రప్రదేశ్(6.46 లక్షలు), తమిళనాడు(5.57 లక్షలు), కర్నాటక(5.4 లక్షలు), ఉత్తర ప్రదేశ్(3.69 లక్షలు) ఉన్నాయి. బుధవారం ఒక్క రోజే 11.56 లక్షల మందికి కరోనా టెస్టులు చేయగా భారత్ లో కరోనా టెస్టుల సంఖ్య 6.74 కోట్లకు చేరుకుందని ఐసిఎంఆర్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News