Saturday, April 20, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దమ రైల్వే 5వ భారత్ గౌరవ్ రైలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి దక్షిణ మధ్య రైల్వే 5వ భారత్ గౌరవ్ రైలు శనివారం నాడు సికింద్రాబాద్‌లో ప్రారంభమైంది. టూరిస్ట్ సర్క్యూట్ ట్రైన్‌గా రెండు తెలుగు రాష్ట్రాల నుండి రైలు ప్రయాణీకులకు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తూ ఈ రైలు 4 ట్రిప్పులను విజయవంతంగా పూర్తి చేసుకొని శనివారం నాడు 5 వ ట్రిప్‌ను ప్రారంభించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ శ్రీ కె.ఆర్.కె. రెడ్డి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఐదవ భారత్ గౌరవ్ రైలు ప్రారంభం కార్యక్రమనికి హాజరై ప్రయాణీకులకు ఆన్‌బోర్డ్ క్యాటరింగ్ సౌకర్యాలను ఆయన పరిశీలించారు. సేవల గురించి వారితో సంభాషించారు. టూర్ ప్యాకేజీ వివరాలను, అభిప్రాయాన్ని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో గ్రూప్ జనరల్ మేనేజర్, ఐఆర్ సిటీసి శ్రీ పి.రాజ్‌కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఈ రైలు రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణీకులకు దేశంలోని తూర్పు , ఉత్తర భాగంలోని కొన్ని పురాతన చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తోంది. సికింద్రాబాద్‌తో పాటు, రెండు తెలుగు రాష్ట్రాలలో కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మొదలైన 8 ప్రదేశాలలో ప్రయాణికులు ఈ రైలు ద్వారా ఎక్కేందుకు/ దిగే సౌకర్యాన్ని అందిస్తుంది. 8 రాత్రులు / 9 పగల్లు వ్యవధిలో పూరి, కోణార్క్, గయ, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్ వంటి ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశాలకు తీసుకువెళతారు. రైలు ప్రయాణీకులకు అందించే అవకాశం కారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి మాత్రమే కాకుండా, మార్గంలోని స్టేషన్ల నుండి కూడా ప్రయాణీకులు భారత్ గౌరవ్ రైలు సేవలను పొందేందుకు ముందుకు వచ్చారు.

రైలు సెకండ్ ఏ సి, ఏ సి (1), థర్డ్ ఏ సి (3) మరియు స్లీపర్ (7) మిశ్రమ కూర్పుతో ఏ సీ మరియు నాన్-ఎసి తో కూడిన సౌకర్యాన్ని ప్రయాణీకులకు అందిస్తుంది. అన్ని సెగ్మెంట్లలో ఈ సౌకర్యం కల్పించారు. సికింద్రాబాద్ స్టేషన్‌తో పాటు వెళ్లే రెండు స్టేషన్‌ల నుండి రైలు ప్రయాణికులు ఎ సి మరియు నాన్-ఎసి రైలు సేవలను పొందవచ్చని దమ రైల్వే తెలిపింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ మాట్లాడుతూ.. దక్షిణ మధ్య రైల్వే నుండి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు అన్ని సేవలకు ప్రయాణీకుల నుండి వచ్చిన విశేషమైన స్పందన రావడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. యాత్రికుల తమ వ్యక్తిగత ప్రయాణ అంశాలను ప్లాన్ చేయడం ద్వారా కలిగే ఇబ్బందులను అధిగమించేదుకు సాంస్కృతికంగా ప్రముఖ మరియు చారిత్రక ప్రదేశాలను సందర్శించడానికి రైలు ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత్ గౌరవ్ రైళ్లు దేశంలో టూరిజం వృద్ధికి పెద్ద పీట వేస్తాయని, పర్యాటక ప్రయాణికుల కోరికలను అత్యంత అనుకూలమైన రీతిలో నెరవేరుస్తుందని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News