Friday, March 29, 2024

కఠువాలో తిరిగి మొదలైన ‘భారత్ జోడో యాత్ర’

- Advertisement -
- Advertisement -

జమ్ము: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని కఠువా జిల్లాలోని హీరానగర్ నుంచి తిరిగి మొదలయింది. గట్టి బందోబస్తు మధ్య ఈ యాత్ర మొదలయింది. అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని హీరానగర్ నుంచి ఉదయం 7.00 గంటలకు ఈ పాదయాత్ర మొదలయింది. పాదయాత్ర సాగుతున్న జమ్ముపఠాన్‌కోట్ హైవేను పోలీసులు, ఇతర భద్రతా బలగాలు సీల్ చేశారు.

జమ్మూకశ్మీర్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వికార్ రసూల్ వనీ, వర్కింగ్ ప్రెసిడెంట్ రమన్ భల్లా, వందలాది వాలంటీర్లు త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని వెంటరాగా రాహుల్ గాంధీ లోండి చెక్‌పోస్ట్‌ను దాటి ఉదయం 8 గంటలకు సంబ జిల్లాలోని తప్యాల్‌గంగ్వాల్‌లోకి ప్రవేశించారు. అభిమానులు, మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిల్చుని వారిని ఉత్సాహపూరితంగా స్వాగతించారు. నేడు దాదాపు 25 కిమీ. నడిచాక పాదయాత్ర రాత్రి చక్ నానక్ వద్ద బసచేయనున్నది. సోమవారం తిరిగి సాంబకు చెందిన విజయ్‌పూర్ నుంచి జమ్ముకు బయలుదేరుతుంది.

రాహుల్ గాంధీ పాదయాత్ర శాంతియుతంగా కొనసాగడానికి అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. పోలీస్, సిఆర్‌పిఎఫ్, భద్రతా బలగాలతో గట్టి నిఘాపెట్టారు. యాత్ర శాంతియుతంగా కొనసాగడానికి ఏర్పాట్లు చేశారు. జమ్ము నగరం శివార్లలోని నర్వాల్ ప్రాంతంలో శనివారం జంట బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో భద్రతను పెంచారు. నర్వాల్ బాంబు పేలుళ్లలో దాదాపు తొమ్మది మంది గాయపడిన విషయం తెలిసిందే. జనవరి 30న శ్రీనగర్‌లోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ జెండా ఎగురవేయడంతో ‘భారత్ జోడో యాత్ర’ ముగియనున్నది.

Bharat Jodo Yatra

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News