Home తాజా వార్తలు పూలోసే భరా భారత్

పూలోసే భరా భారత్

బాలీవుడ్‌లోని సీనియర్ స్టార్ హీరోయిన్లలో కత్రినా కైఫ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 ఏళ్లు దాటినా ఈ బ్యూటీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కత్రినా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తాజా చిత్రం ’భారత్’లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా రంజాన్ పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్లలో బిజీగా ఉంది ఈ భామ. ఇదిలాఉండగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా రోజుకు రెండు, మూడు ఫొటోలను పోస్ట్ చేస్తూ కత్రినాకైఫ్ అభిమానులను మురిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ కలర్‌ఫుల్ ఫొటోను పోస్ట్ చేసింది. సింపుల్‌గా ఉండే కలర్‌ఫుల్ డ్రెస్‌లో చిరునవ్వులు చిందిస్తూ ఫొటోలో దర్శనమిచ్చింది ఈ భామ. ‘పూలోసే భరా భారత్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రింటెడ్ ఫ్లవర్స్ ఉన్న ఒక అందమైన గౌన్ వేసుకొని నవ్వుతూ దర్శనమిచ్చిన కత్రినాకైఫ్ అభిమానులను మైమరపిస్తోంది.

Bharat movie releasing on Ramzan festival