Thursday, April 25, 2024

ప్రభం’జనం’

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/ఖమ్మం: నభూతో నభవిష్యత్.. అన్న చందంగా భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) అవిర్భావ సభ అంచనాలకు మించి విజయవంతం అయ్యింది. టిఆర్‌ఎస్ పాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా ఉద్భవించిన తరువాత తొలిసారిగా ఉద్యమాల గడ్డ అయిన ఖమ్మం పురటి అడ్డపై బుధవారం జరిగిన భారీ బహిరంగ సభ గ్రాడ్ సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో నూతనోత్తజం వెల్లివిరిసింది. బిజెపి, కాంగ్రెస్‌యేతర పార్టీలను ఒక తాటిపైకి తీసుకొస్తూ బిజెపిపై యుద్ధం ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఖమ్మం కేంద్రంగా నిర్వహించిన అవిర్భావ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులు, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాది పార్టీ అధినేత, సిపిఐ, సిపిఎం పార్టీలకు చెందిన జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరయ్యే బిఆర్‌ఎస్‌కు సంఘీభావం ప్రకటించి మనస్ఫూర్తిగా ఆశీర్వదించిన ఈ సభ ఖమ్మం జిల్లా చరిత్రలోనే స్థిరస్థాయిగా నిలిచిపోనుంది. ఖమ్మం జిల్లా ఉద్భవించిన నాటి నుంచి ఇప్పటివరకు కనివీని ఎరగని రీతిలో నిర్వహించిన ఈ సభకు లక్షలాదిగా జనం కదలివచ్చారు. ఖమ్మం జిల్లా చుట్టూ ప్రక్కల ఉన్న జిల్లాల నుంచే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా గులాబీ దండు కదంతొక్కింది. వందలాది వాహనాల్లో అశేష జనవాహని కదలివచ్చింది.

ఖమ్మం నగరానికి పది కిలో మీటర్ల దూరంలో రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరే భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోని వంద ఎకరాల స్ధలంలో బిఆర్‌ఎస్ అవిర్భావ సభను ఏర్పాటు చేశారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. పక్షం రోజులుగా అవిశ్రాంతంగా శ్రమించి లక్షలాదిగా జనసమీకరణ చేశారు. అయితే బిఆర్‌ఎస్ నేతలు ఉహించినదానికంటే జనం తండోపతండాలుగా తరలివచ్చారు. బుధవారం ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ గ్రామాల నుంచి పార్టీ శ్రేణులు వెల్లువై తరలివచ్చారు. వందలాది లారీలు, ఆర్టీసి, ప్రయివేట్ బస్సులు, ట్రాక్టర్లు, డిసిఎం, టాటా ఎసీలు, కార్లు ఇతర వాహనాల్లో ఖమ్మం నగరానికి తరలివచ్చారు. సభ ప్రారంభానికే సభా మైదానం పూర్తిగా జనంతో నిండిపోయింది. ఇంకా వేలాదిమంది సభ జరిగే జాతీయ రహదారిపై క్కికరిసిపోయారు. దాదాపు కిలోమీటర్ల కొద్ది జనం రోడ్లపైనే నిల్చున్నారు.

సూదూర ప్రాంతాలకు చెందిన చాలా వాహనాలు ట్రా ఫిక్ జామ్ కావడంతో సభా వేధిక వద్దకు చేరుకోలేకపోయారు. సత్తుపల్లి, వైరా, కొత్తగూడెం ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది వాహనాలు ఖమ్మం నగరానికి చేరుకున్నప్పటికి సభా వేధిక వద్దకు రావడానికి గంటలకొద్ది సమయం తీసుకుంది. చాలా వాహనాలు ట్రాఫిక్‌లో జా మ్ అయ్యాయి. దీంతో ఆయా వాహనాలు సకాలంలో సభావేదిక వద్దకు రాలేకపోయాయి. మరికొన్ని బస్సులు రోడ్లపైనే అగిపోవడంతో జనం అంతా బస్సు టాప్‌లపై కూర్చోని నాయకుల ప్రసంగాలు విన్నారు. సభ మైదా నం జనంతో కిక్కరిసిపోయింది. శ్రీశ్రీ జంక్షన్ నుంచి సభా వేధిక వరకు, కొణిజర్ల నుంచి సభా వేధిక వరకు అడుగుతీసి అడుగు వేయలేనివిధంగా రోడ్లన్ని జనంతో నిండిపోయాయి. సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, మహబుబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి ఆర్టీసీ బస్సులు, స్కూళ్లు, కళాశాల బస్సుల్లో జనం ఉత్సాహంగా తరలివచ్చారు.

ఉమ్మడి జిల్లాల నుంచి అన్ని సెగ్మెంట్ల నుంచి జనం భారీ ఎత్తున తరలివచ్చారు. ప్రధానంగా ఖమ్మం నగరంతోపాటు మధిర, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గాల నుంచి భారీసంఖ్యలో హాజరయ్యారు. సభా మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభం అవుతందని చెప్పడం వల్ల ఖమ్మం నగరానికి దగ్గర్లో ఉన్న గ్రామాల ప్రజలు, ఖమ్మం నగర వాసులు మధ్యాహ్న భోజనంచేసి బయలుదేరారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు మధ్యలోనే భోజనంచేసి సభావేధిక వద్దకు చేరుకున్నారు. ఖమ్మం, కొణిజర్ల, చింతకాని ప్రాంతాలకు చెందిన చాలా మంది కాలినడకన, ద్విచక్ర వాహనాలు, ఆటోలో వచ్చా రు. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన నాట్యం చే స్తున్నా లెక్క చేయకుండా సభ ముగిసేవరకు జనం అ లానే నేతల ఉపన్యాసాలు ఉన్నారు. ఉదయం 11గంట ల నుంచే జనం సభ ప్రాంగణానికి చేరుకోవడం కన్పించింది. సభా జరుగుతున్నంత సేపు జనం వస్తునే ఉన్నారు.

సభా ముగిసే సమయంలో కూడా ఇంకా జనంతో కూడిన వాహనాలు రావడం కన్పించింది. ఈ సభలో జా తీయ నేతలు హిందీ, ఇంగ్లీష్ భాషలో ప్రసంగిస్తున్నప్పటికి ప్రజలంతా ఓపికగా విన్నారు. సభకు కేవలం బిఆర్‌ఎస్ కార్యకర్తలే కాకుండా సామాన్యులు సైతం వచ్చారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఒక మాజీ ముఖ్యమంత్రి పలు పార్టీల జాతీయ నాయకులు హాజరవుతున్నందున వారి ప్రసంగాలను వినేందుకు ఖమ్మం నగరవాసులు కూడా భారీగానే తరలివచ్చారు. గ్రానైట్ ఫ్యాక్టరీ దాని అనుబంధ సంఘాలకు చెందిన యజమానులు, కార్మికు లు, ఆటో కార్మికులు, మార్కెట్ దడవాయిలు, న్యాయవాదులు, మహిళలు పెద్దఎత్తున్న హాజరవడం కన్పించింది.

లక్షలాది మంది జనం కదిలివచ్చినప్పటికి కూడా సభలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన ముఖ్యనేతలకు, మహిళలకు, విలేఖర్లకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు. నియోజకర్గాల వారీగా ఎన్‌క్లోజర్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఎన్‌క్లోజర్‌లో బిఆర్‌ఎస్ కార్యకర్తలు వలంటీర్లుగా ఉన్నారు. ఎండ తీవ్రత ఉండటంతో జనం మంచినీటి కోసం ఎగపడగా వారందరికి మంచినీటి ప్యాకెట్లను అందజేశారు. సభా ముందు వరసలో దాదాపు 70వేల కూర్చీలను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ చిన్న లోపం లేకుండా సభ సజావుగా జరిగిందపి చెప్పొచ్చు. సభ వేదిక అందరికి కన్పించే విధంగా సభ మైదానంలో 50 ఎల్‌ఇడి తెరలను ఏర్పాటు చేశారు. జన సమీకరణలో బాధ్యతలు తీసుకున్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు పూర్తిగా సఫలికృతులయ్యరని చెప్పవచ్చు.

సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రసంగిస్తూ బిజెపి పార్టీపై విరుచకపడ్డారు. 75 ఏళ్ల స్వాతంత్రం వచ్చిన తరువాత ఇంకా కలుషిత నీరు సేవించడం, కెనడా నుంచి కందిపప్పును దిగుమతి చేసుకోవడం, అకలితో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి, ఇతర దేశాల అభివృద్ధిని భారతదేశ అభివృద్ధితో పొల్చుతూ ప్రజలను అలోచింపజేశారు. దేశంలో లక్షలాది కోట్ల విలువైన సహజ వనరులు, పకృతి వనరులు పుష్కలంగా ఉన్నప్పటికి 75 ఏళ్ల కాలంలో వాటిని సంపూర్ణంగా వాడుకోకపోవడం వల్లనే మన దేశం అప్పుల దేశంగా మారిందని, ఈ కారణాల చేతనే బిఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేశానని, ఈ అభివృద్ధిని సాధించడమే బిఆర్‌ఎస్ ప్రధాన ఏజెండాగా ఆయన ఈ సభావేధిక ద్వారా ఉత్సాహంగా ప్రకటించారు బిఆర్‌ఎస్ అధికారంలోకివస్తే తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలన్నింటిని దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఈ సభ పూర్వకంగా హామి ఇచ్చారు కెసిఆర్.

రానున్న ఎన్నికల్లో ఢిల్లీలో పాగా వేసి, దేశ గతిని మార్చాలనే ప్రధాన లక్షంతో ఏర్పాటుచేసిన బిఆర్‌ఎస్ పార్టీని జాతీయ పార్టీలైన ఆమ్ ఆద్మీ, సమాజ్‌వాదీ, సిపిఐ, సిపిఎం పార్టీల ముఖ్యనేతలు ఖమ్మం సభావేధిక సాక్షి గా స్వాగతిస్తూ వారి సంఘీభావాన్ని ప్రకటించారు. భవిష్యత్తులో బిజెపి, కాంగ్రెస్‌యేతర పార్టీలన్నింటిని ఏకంచేసి తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృధ్ధి పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలనేదే బిఆర్‌ఎస్ ప్రాథమిక ఏజెండా అని, పూర్తిస్థాయి రాజకీయ అజెండా, బిఆర్‌ఎస్ పార్టీ లక్ష్యాలు, విధి విధానాలను అతి త్వరలో తయారు చేసి ప్రకటిస్తామని ఈ సభ ద్వారా బిఆర్‌ఎస్ అధినేత ప్రకటించారు. ఈ సభ సక్సెస్ కావడంతో దేశ చరిత్రలో ఒక మహత్తర ఘట్టం ఖమ్మం వేధిక ద్వారా అవిష్కృతమైనట్లయింది. ఒకప్పుడు ఇందిరాగాంధీ వ్యతిరేక ఉద్యమం గుజరాత్ నుంచి ప్రారంభం అయితే ఇప్పుడు బిజెపికి వ్యతిరేక ఉద్యమం తెలంగాణ నుంచి ఆరంభమైందని పరిశీలకులు భావిస్తున్నారు.

సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు తెలంగాణలో పర్యటించిన ముగ్గురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా సిఎం కెసిఆర్ ఇచ్చిన అతిథ్యంతో ఫిదా అయ్యారు. యాదాద్రి దేవాలయాన్ని సందర్శింపజేసి దైవ దర్శనం చేయించడం, ఆ తరువాత ఖమ్మం నగరంలో ప్రపంచంలోనే గుర్తింపు పొందిన కంటి వెలుగు కార్యక్రమాన్ని వాళ్ళచేత ప్రారంభింపజేయడం, సమీకృత కలెక్టరేట్ భవనాలను వారిచేత ప్రారంభింపజేయడంతో వారంతా పూర్తి సంతోషాన్ని వ్యక్తం చేసి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు సభా వేదిక ద్వారా కృతజ్ణతలు తెలిపారు.

ట్రబుల్ షూటర్ హరీశ్ రావు సక్సెస్

బిఆర్ ఎస్ సభను సక్సెస్ చేయడంలో సభా బాధ్యతలు తీసుకున్న ఆర్థ్ధిక మంత్రి హారీశ్‌రావు సఫలీకృతులయ్యారు. అతి తక్కువ వ్యవధిలోనే సభా తేది ఖారారు అయినప్పటికీ, ఏలాంటి అపశృతులు దొర్లకుండా సం పూర్ణగా విజయవంతం చేశారు. జనసమీకరణపై పకడ్బందీగా ప్రణాళిక వేసి పూర్తి స్థాయిలో జనసమీకరణ చేశారు. సంక్రాంతి పండగను సైతం పక్కన పెట్టి పది రోజులపాటు ఖమ్మంలోనే ఆయన మకాం వేసి ఈ సభ ను ఎక్కడ ఏ లోపం లేకుండా నిర్వహించారు. హరీ శ్‌రావుకు తోడు జిల్లాకు చెందిన రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపిలు నామా నాగేశ్వర్‌రావు, వద్దిరాజు రవీచంద్ర, ఎంఎల్‌ఎలు సండ్ర వెంకటవీరయ్య, కందాళ్ళ ఉపందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజు తదితరులు ఈ సభ విజయవంతం కోసం పూర్తిస్థాయిలో సహకరించారు. ఈ సభ సక్సస్ ఘనత ముందుగా ప్రధాన ఇన్‌చార్జి తన్నీరు హరీశ్‌రావుకే దక్కుతుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సభను విజయవంత కావడానికి అహోరాత్రులు శ్రమించిన మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్‌తోపాటు ఎమ్మెల్సీ రాజేశ్వర్ రెడ్డిలను, సభ విజయవంత కోసం కష్టపడ్డ వారందరిని సభా వేధిక ద్వారా కెసిఆర్ ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News