Sunday, March 26, 2023

భారత్‌కే ఛాన్స్: గంగూలీ

- Advertisement -

ganguly

కోయంబత్తూరు:దక్షిణాఫ్రికాతో శనివారం జరిగే చివరి ట్వంటీ20లో భారత్‌కే గెలుపు అవకాశాలు అధికంగా ఉన్నాయని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ బలమైన జట్టుగా ఎదిగిందనడానికి దక్షిణాఫ్రికాలో జట్టు ప్రదర్శనే నిదర్శనమన్నాడు. సఫారీ వంటి బలమైన జట్టు ను సొంత గడ్డపై ఏ జట్టుకైనా చాలా కష్టమని, కానీ భారత్ దాన్ని ఆచరణలో చేసి చూపిందని ప్రశంసించాడు. శుక్రవారం కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గంగూలీ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ట్వంటీ20 ఫార్మాట్‌కు విపరీత ఆదరణ లభిస్తుందన్నాడు. పరిస్థితి ఎంతలా వచ్చిందంటేటి20లులేకుండా క్రికెట్‌ను ఊహిం చే ప్రసక్తే లేకుండా పోయిందన్నాడు. ఐపిఎల్, బిగ్‌బాష్ తదితర టోర్నమెంట్‌లకు టి20 ఫార్మాట్‌కు మంచి ఆదరణ లభించిందన్నాడు. క్రికెట్ ఆడే అన్ని ప్రధాన దేశాలు టి20కు ఎం తో ప్రాధాన్యత ఇస్తున్నాయని, అంతేగాక టి20 లీగ్‌లు నిర్వహిస్తూ క్రికెట్‌ను మరింత ప్రాచుర్యంలోకి తెస్తున్నాయని వివరించాడు. రానున్న రోజుల్లో ప్రపంచ క్రికెట్‌లో పొట్టి ఫార్మాట్‌దే రాజ్యమని చెప్పడంలో అతిశయోక్తి లేదన్నాడు. టి20 లీగ్‌ల రాకతో ఎందరో ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారని గంగూలీ పేర్కొన్నాడు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లిపై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లి నిర్వహిస్తున్న బాధ్యతలు తనను ఎంతో ఆకట్టు కున్నాయన్నాడు. అతని సారథ్యంలో భారత్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తుందనే నమ్మకం తనకుందన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News