Home జగిత్యాల భూ సమస్యల పరిష్కార గ్రామంగా భీంరాజ్‌పల్లి

భూ సమస్యల పరిష్కార గ్రామంగా భీంరాజ్‌పల్లి

bandi

ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్
మనతెలంగాణ/గొల్లపల్లి: రెవెన్యూ భూ రికార్డుల శుద్ధీకర ణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో గొల్లపల్లి మండలంలో ని భీంరాజుపల్లి గ్రామాన్ని సంపూర్ణ భూ సమస్యల పరిష్కా ర గ్రామంగా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ప్రకటిం చారు. ఆదివారం గ్రామంలో సవరించిన 1బి పత్రాల పం పిణీ కార్యక్రమంలో చీఫ్‌విప్ కొప్పుల మాట్లాడుతూ, రెవె న్యూ, భూ రికార్డుల శుద్ధీకరణ కార్యక్రమంలో 99 శాతం తో రాష్ట్రంలోనే జిల్లా ప్రథమంగా నిలిచిందన్నారు. స్వాతం త్య్రం వచ్చి 70ఏళ్లు గడిచినా ఇటువంటి బృహత్తర కార్యక్ర మం ఎప్పుడూ చేపట్టలేదన్నారు. చిత్తశుద్ధితో, నిజాయితీతో చేపట్టిన ఈ కార్యక్రమంతో లక్షలాది మందికి ఉపశమనం కలిగిందన్నారు. డిసెంబర్ 15 నాటికి భూ సమస్యలు లేని రాష్ట్రంగా, భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేపట్టి దే శంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామన్నా రు. విరాసత్, పేరు తప్పులుండి ఏళ్లుగా కార్యాలయాల చు ట్టూ తిరిగి, తిరిగి, కోర్టుల్లో కేసులు వేసి తీర్పు కోసం ఎదు రు చూసేవారన్నారు.
రెవెన్యూ యంత్రాంగం గ్రామంలోనే 10రోజుల పాటు ఉ ండి సమస్యలను గుర్తించి, గుర్తించిన మొత్తం సమస్యలను పరిష్కరించడం చాలా గొప్ప విషయమన్నారు. ఇంటింటికి నల్లా ద్వారా నీరందించే మిషన్ భగీరథ పనులు పూర్తి కాను న్నాయన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పునరు ద్ధ్దరించుకుని ఆయకట్టు పెంచుకున్నామన్నారు. కల్యాణల క్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా పేదింటి ఆడపిల్ల వివా హనికి రూ.71,116 ఇస్తున్నారన్నారు. కెసిఆర్ కిట్ ద్వారా పేదవారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు.వ్యవసాయానికి 24గంటలు నిరం తర కరెంట్ సరఫరాకు చర్యలు తీసుకున్నామన్నారు. ఎరు వులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామన్నారు. వచ్చే ఏ డాది నుంచి ఎకరాకు రూ.4 వేల చొప్పున రెండు పనులకు రూ.8 వేలు వ్యవసాయ పెట్టుబడి రైతు ఖాతాలో జమ చేస్తా మన్నారు.రానున్న కాలంలో ఎస్‌ఆర్‌ఎస్‌పిలో 365 రోజులు సమృద్దిగా నీరు ఉండేలా, వరద కాల్వలో ఏడాది పొడవునా నీరు పొందేలా పనులు జరుగుతున్నాయన్నారు. మూడున్న ర ఏండ్లలోనే చాల గొప్పగా ఎదిగామని, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నామన్నారు.జిల్లాకు ముందంజ లో నిలుపుతున్న జిల్లా కలెక్టర్,జిల్లా యంత్రాంగాన్ని చీఫ్ విప్ మనస్పూర్తిగా అభినందించారు.
భూ వివాదరహిత గ్రామంగా రాష్ట్రంలోనే భీంరాజ్‌పల్లి మొదటి గ్రామమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జి ల్లా కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, భూ రికార్డుల ప్రక్షాళన అంత సులభం కాదని, భూ సమస్యలు చాల జటిలంగా ఉంటాయన్నారు. జమీన్‌బందీ కార్యక్రమంతో 20వేల మం ది భూసమస్యలను తీర్చడం జరిగిందన్నారు.క్షేత్ర స్థాయిలో భూమికి, రికార్డుల్లో ఉన్న భూమికి సరిపోయేలా భూ రికా ర్డుల శుద్ధీకరణ చేపడుతున్నామన్నారు. వ్యవసాయ భూ మి , వ్యవసాయేతర భూమి, ఇండ్లు, రోడ్లు, ప్రభుత్వ సం స్థలు, అటవీ భూమి తదితరాలు ప్రక్రియతో తేటతెల్లమవుతా యన్నారు.
పది రోజులు రెవెన్యూ యంత్రాంగం గ్రామంలోనే ఉండి రికార్డులు పట్టేదారుకు చూపి వారి నుంచి అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పరిష్కరించి తిరిగి సవరణ చేసిన రికార్డును అందజేస్తున్నామన్నారు.జిల్లాలోని 291 రెవెన్యూ గ్రామాలకు గాను 204రెవెన్యూ గ్రామాల్లో ఈ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ తెలిపారు. 204 గ్రామాల్లో 3 లక్షల పైబడి సమస్యలను గుర్తించి పరిష్కరించామన్నారు.60 గ్రా మాలు నూటికి నూరుశాతం భూ వివాదరహిత గ్రామాలు గా నిలిచాయని, పరిష్కార పత్రాలు అందిస్తున్న మొదటి గ్రామంగా భీంరాజ్‌పల్లి నిలిచిందన్నారు.
కార్యక్రమంలో సవరించిన 1బి పత్రాలను పంపిణీ చేశారు. అంతకుముందు గ్రామస్తులు చీఫ్ విప్ ఈశ్వర్‌ను, కలెక్టర్ శరత్‌ను ఎడ్లబండిపై భారీ ప్రదర్శనగా సభా స్థలికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజేశం, ఆ దిలాబాద్ జిల్లా జెసి కృష్ణారెడ్డి, ఆర్‌డిఓ నరేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్‌రావు, ఎంపిపి సత్త వ్వ, జడ్‌పిటిసి శైలజ, ఎంపిటిసి నాగవ్వ, సర్పంచ్ ఎల్లవ్వ, రైతు సమన్వయ సమితి సంఘం అధ్యక్షుడు కృష్ణారెడ్డి, అధి కారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.