Home తాజా వార్తలు భోజ్ పురి నటి అనుపమ ఆత్మహత్య

భోజ్ పురి నటి అనుపమ ఆత్మహత్య

Bhojpuri Actress Anupama Commits Sucideముంబయి : సినిమా పరిశ్రమలో వరుసు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. జూన్ లో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ అనుమానాస్పదస్థితిలో చనిపోయారు. గురువారం హిందీ బుల్లితెర నటుడు సమీర్ శర్మ తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో భోజ్ పురి నటి అనుపమా పాథక్ కూడా శుక్రవారం ఉదయం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు ఆమె రాసిపెట్టిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు స్వార్థపరులని, పక్కవారు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోరని ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ లోకంలో ఎవరిని నమ్మవద్దని, నమ్మితే మోసపోవడం ఖాయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బును మెచ్యూరిటీ తరువాత కూడా మలాడ్ లోని విజ్ డమ్ ప్రొడ్యూసర్ సంస్థ ఇవ్వలేదని, అంతేకాదు మనీష్ ఝా అనే వ్యక్తి తన కారును  తీసుకుని తిరిగి ఇవ్వలేదని ఆమె తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. అనుపమా పాథక్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.