Thursday, April 25, 2024

‘భోళా శంకర్’ విడుదల తేదీ ఖరారు

- Advertisement -
- Advertisement -

'Bhola Shankar' release date finalized

 

మెగాస్టార్ చిరంజీవి- స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతున్న మెగా మాసివ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ “’భోళా శంకర్”. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం విడుదల తేది ఖరారైయింది. ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 14, 2023న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డే ‘శుక్రవారం’ అంబేద్కర్ జయంతి పబ్లిక్ హాలీడే. దాని తర్వాత వీకెండ్ సెలవులు వస్తాయి. అంటే బాక్సాఫీస్‌ వద్ద మూడు రోజుల పాటు మెగా ర్యాంపేజ్‌ ఖాయం. రేపు(ఆగస్టు22) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా  ‘భోళా శంకర్’ బ్రాండ్ న్యూ పోస్టర్‌ను విడుదల చేస్తూ ప్రకటన చేశారు.

పోస్టర్‌లో చిరంజీవి స్టైలిష్ గా నడుస్తూ  ట్రైడెంట్ కీచైన్‌ ని తిప్పుతూ మెగా స్తయిలీష్ గా కనిపించారు. హీరోలని స్టైలిష్  గా ప్రజంట్ చేయడంలో పేరు తెచ్చుకున్న మెహర్ రమేష్ .. ట్రెండీ కాస్ట్యూమ్స్ , కళ్ళద్దాలతో  మెగాస్టార్‌ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గట్టు మెగాస్టార్ ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. మెగాస్టార్ వింటేజ్ స్వాగ్, మెహర్ రమేష్ స్టైల్‌.. రానున్న సమ్మర్‌లో అభిమానులకు పండగలా ఉంటుందని చెప్పాలి. భోలా శంకర్ ఇప్పటివరకు 40శాతం పూర్తయింది. అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పై ఈ  భారీ బడ్జెట్ చిత్రం ప్రతిష్టాత్మకంగా తతెరకెక్కుతోంది. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లో జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా, డాజ్లింగ్ బ్యూటీ తమన్నా మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. క్రియేటివ్ కమర్షియల్స్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ సంగీతం అందించగా, డూడ్లే సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సత్యానంద్ కథ పర్యవేక్షకుడిగా, తిరుపతి మామిడాల డైలాగ్ రైటర్ గా , మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా,  ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ గరికిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News