Thursday, April 25, 2024

ఐపిఎల్ నుంచి భువనేశ్వర్, మిశ్రా ఔట్..

- Advertisement -
- Advertisement -

Bhuvneshwar Kumar out of IPL 2020 with Muscle Injury

దుబాయి: సీనియర్ క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్ (సన్‌రైజర్స్), అమిత్ మిశ్రా (ఢిల్లీ క్యాపిటల్స్) గాయాల వల్ల యుఎఇ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగారు. ఈ విషయాన్ని ఆయా ఫ్రాంచైజీలకు చెందిన అధికారులు అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్‌కు భువనేశ్వర్ కీలక బౌలర్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా భువనేశ్వర్ గాయపడ్డాడు. కండరాలు పట్టేయడంతో అతను ఓవర్‌ను కూడా పూర్తి చేయలేక పోయాడు. మధ్యలోనే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇక ఆదివారం ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కూడా అతను బరిలోకి దిగలేదు.

మరోవైపు గాయం తీవ్రత అధికంగా ఉండడంతో అతను టోర్నీ మొత్తానికే అందుబాటులో లేకుండా పోయాడు. భువనేశ్వర్ అర్ధాంతరంగా వైదొలగడం హైదరాబాద్‌కు అతి పెద్ద షాక్‌గా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇదిలావుండగా ఢిల్లీ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా గాయం వల్ల ఐపిఎల్‌కు దూరం అయ్యాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా మిశ్రా చేతి వేలికి గాయమైంది. నితీష్ రానా ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో మిశ్రా గాయం బారిన పడ్డాడు. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో మిశ్రా తన ఓవర్ల కోటాను కూడా పూర్తి చేయకుండానే మైదానాన్ని వీడాల్సి వచ్చింది. ఇక గాయం తీవ్రత అధికంగా ఉండడంతో ఐపిఎల్ మొత్తానికి దూరం కాక తప్పలేదు.

Bhuvneshwar Kumar out of IPL 2020 with Muscle Injury

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News