Home అంతర్జాతీయ వార్తలు వారం రోజుల్లో జోబైడెన్ కేబినెట్‌

వారం రోజుల్లో జోబైడెన్ కేబినెట్‌

Biden could announce Cabinet picks as next week

 

వాషింగ్టన్: వారం రోజుల్లో తన కేబినెట్ వివరాల్ని ప్రకటించేందుకు అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ సిద్ధమవుతున్నారని అసోనియేటెడ్ ప్రెస్ పేర్కొన్నది. ఇప్పటికే ట్రెజరీకి ఎవరిని నామినేట్ చేయాలో నిర్ణయించానని బైడెన్ చెప్పారని తెలిపింది. ఆర్థికశాఖ, ప్రజాఆరోగ్యం శాఖల కార్యదర్శుల్ని త్వరలోనే ప్రకటించనున్నట్టు అసోనియేటెడ్ ప్రెస్ పేర్కొన్నది. తన గెలుపును ట్రంప్ నిరాకరించినప్పటికీ జనవరి 20న అధ్యక్ష పదవి చేపట్టడానికి అవసరమైన కసరత్తును ప్రారంభించానన్న సంకేతాలివ్వడానికే మీడియాకు బైడెన్ ఈ వివరాలిస్తున్నారు. బైడెన్ కేబినెట్‌లో ఉండే 15 కీలక శాఖలకు పలు వర్గాల నుంచి డిమాండ్స్ ఉన్నట్టు మీడియా పేర్కొన్నది. తుది జాబితాలో విదేశాంగశాఖ మాజీ డిప్యూటీ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్, డెలావర్ సెనేటర్ క్రిస్‌కూన్స్ పేర్లు ఖరారైనట్టు చెబుతున్నారు.

అధికారాల బదిలీకి చర్యలు : వైట్‌హౌస్
వాషింగ్టన్: అధ్యక్షస్థానం బదిలీ చట్టం కింద అవసరమైన అన్ని చర్యలూ ట్రంప్ పాలనా విభాగం చేపడుతోందని వైట్‌హౌస్ మీడియా కార్యదర్శి కేలీగ్‌మెక్‌ఎనానీ తెలిపారు. చట్టపరమైన చర్యల్ని కొనసాగిస్తామని తెలిపారు. నవంబర్ 3న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, బైడెన్ విజయాన్ని అంగీకరించని ట్రంప్.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పలు కోర్టుల్లో పిటిషన్లు వేశారు.

Biden could announce Cabinet picks as next week