Home ఎడిటోరియల్ పర్యావరణంపై వాగాడంబరం

పర్యావరణంపై వాగాడంబరం

Aarey-colony

ముంబైలోని గోరేగాంవ్‌లో పోవాయ్ నుంచి పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే వరకు విస్తరించి ఉన్న ప్రాంతం ఆరె కాలనీ. 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతాన్ని ఆరె మిల్క్ కాలనీ అంటారు. దట్టమైన చెట్లతో గల అందమైన గ్రీన్ జోన్ ఇది. ఇందులో చిత్తడి భూములు, గడ్డి భూములు, అటవీ భూములు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 77 రకాల పక్షులు, 34 జాతుల అడవి పూలు, 86 జాతుల సీతాకోక చిలుకలు, 13 రకాల ఉభయ చరాలు, 46 రకాలు సరీసృపాలు, 16 జాతుల క్షీరదాలు, 90 రకాల సాలీళ్ళు ఇక్కడ ఉన్నాయి. కొత్తగా కనిపెట్టిన అనేక తేళ్ళు, సాలీళ్ళు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. కొన్ని జాతులకు ఈ అడవి జాతులనే పేరుపెట్టారు. హెటెరో ఫిక్టస్ ఆరెనీసిస్ అలాంటివే.

పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు మరో దెబ్బ తగిలింది. ముంబైలో ఆరె కాలనీ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఉద్యమకారులకు నిరుత్సాహాన్ని మిగిల్చింది. అక్టోబర్ 21వ తేదీన ఈ సమస్యపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ముంబయిలోని ఆరె కాలనీలో మెట్రో షెడ్ ప్రాజెక్టును ఆపేయాలనే విజ్ఞప్తులను సుప్రీంకోర్టు తోసి పుచ్చింది. మెట్రో ప్రాజెక్టు విషయంలో ఎలాంటి స్టే ఆర్డరు లేదని స్పష్టం చేసింది. ఆరె కాలనీలో కేవలం చెట్ల నరికివేతపై మాత్రమే స్టే ఇచ్చామని స్పష్టం చేసింది.

ఆరె వివాదం గురించి అనేక కథనాలు వస్తున్నాయి. ఈ వివాదమేమిటి? ఆరె గురించి, అడవుల గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం అవసరం. ముంబైలోని గోరేగాంవ్‌లో పోవాయ్ నుంచి పశ్చిమ ఎక్స్‌ప్రెస్ హైవే వరకు విస్తరించి ఉన్న ప్రాంతం ఆరె కాలనీ. 16 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న ఈ ప్రాంతాన్ని ఆరె మిల్క్ కాలనీ అంటారు. దట్టమైన చెట్లతో గల అందమైన గ్రీన్ జోన్ ఇది. ఇందులో చిత్తడి భూములు, గడ్డి భూములు, అటవీ భూములు ఉన్నాయి. ఇక్కడ దాదాపు 77 రకాల పక్షులు, 34 జాతుల అడవి పూలు, 86 జాతుల సీతాకోక చిలుకలు, 13 రకాల ఉభయ చరాలు, 46 రకాలు సరీసృపాలు, 16 జాతుల క్షీరదాలు, 90 రకాల సాలీళ్ళు ఇక్కడ ఉన్నాయి. కొత్తగా కనిపెట్టిన అనేక తేళ్ళు, సాలీళ్ళు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. కొన్ని జాతులకు ఈ అడవి జాతులనే పేరుపెట్టారు. హెటెరో ఫిక్టస్ ఆరెనీసిస్ అలాంటివే. ఇంతకు ముందు ఇది సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లో భాగంగా ఉండేది. తర్వాత రిజర్వు ఫారెస్టుగా ప్రకటించడం జరిగింది.

ఈ కాలనీలో 27 ఆదివాసీ తెగలు కూడా నివసిస్తున్నాయి. వర్లీ ఆదివాసులు తదితర తెగలకు చెందిన 3,500 మంది ఇక్కడ నివసిస్తున్నారు. వారందరు ఇప్పుడు నిరాశ్రయులయ్యే ప్రమాదం వచ్చంది. ఈ అడవి భూమిలో కొంత భాగాన్ని ముంబయి మెట్రో రైల్ కార్పొరేషనుకు ఇచ్చారు. దాదాపు 900 కోట్ల రూపాయలతో ఇక్కడ కారు షెడ్ నిర్మించడానికి అనుమతి ఇచ్చారు. కొలాబా బాంద్రా మెట్రో లైను కోసం ఈ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దీని కోసం 33 హెక్టారుల భూమి కేటాయించారు. అంటే ఆరె కాలనీలో 2 శాతం భూభాగం ఈ కారు షెడ్డు కోసం ఇచ్చేశారు. ఈ భూమిలో 27 వేల చెట్లున్నాయి. వీటన్నింటిపై గొడ్డలి వేటు పడనుంది. ఈ భూమిని కేటాయించడం వల్ల భవిష్యత్తులో మొత్తం అడవిలోని చెట్లన్నింటినీ నరికేస్తారని ఆందోళనకారులు వాదిస్తున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల్లోనూ ఈ సమస్య ప్రస్తావనకు వచ్చింది. బిజెపి నేతలు, రాష్ట్రప్రభుత్వం ఇక్కడ కారు షెడ్డు నిర్మించాలని గట్టిగా వాదిస్తున్నారు. చెట్ల నరికివేతల వల్ల వచ్చే నష్టం కన్నా మెట్రో ప్రాజెక్టు వల్ల వచ్చే లాభం ఎక్కువని వాదిస్తున్నారు. కాని చాలా మంది ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, బిజెపి మిత్రపక్షం శివసేన కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నాయి. అక్టోబర్ 4వ తేదీ రాత్రి జరిగిన సంఘటన ఆందోళనలను మరింత పెంచింది. మెట్రోప్రాజెక్టు కోసం 2,646 చెట్లను నరికేసే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత కొది ్దగంటలకే ఆరె కాలనీలో అధికారులు చెట్ల నరికివేత భారీ స్థాయిలో ప్రారంభించారు.

పిటీషనర్లు సుప్రీంకోర్టుకు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్ళవచ్చని హైకోర్టు చెప్పింది. ఆందోళనకారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి చెట్ల నరికివేతను ప్రతిఘటించారు. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. అనేక మంది ఆందోళనకారులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా ఈ సమస్య చర్చకు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనేక మంది వ్యతిరేకించడం ప్రారంభించారు.

ఆందోళనకారులు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. సుప్రీంకోర్టు ఈ వివాదం గురించి వ్యాఖ్యానిస్తూ గతంలో ఆరె ఒక అడవి అయివుంటుందని అభిప్రాయపడింది. ఎన్ని చెట్లను నరికివేశారో రిపోర్టు ఇవ్వమని కోరింది. అక్టోబర్ 7వ తేదీన కోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేస్తూ చెట్ల నరికివేతను అడ్డుకుంది. ఆరె అడవి భూమి అవునా కాదా అనే స్పష్టత లేదు. దాని వల్ల సమస్య మరింత చిక్కుముడి అయ్యింది. దట్టమైన చెట్లున్న ఈ ప్రాంతం అటవీ భూమి అనే స్పష్టత లేనందువల్ల ఈ భూమిని మెట్రో నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. కాని ఆరె కాలనీ సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో భాగం. అటవీ భూమిగా గుర్తింపు లేని ప్రదేశంలో చెట్లను నరకడానికి చట్టం అనుమతిస్తున్నప్పటికీ సంజయ్ గాంధీ నేషనల్ పార్కులో భాగంగా ఆరె ఉంది కాబట్టి ఈ సడలింపు వర్తించదు.

ముంబయి నగరానికి ఆరె కాలనీ ఊపిరితిత్తుల వంటిదిగా పేరు పొందింది. ముంబయి నగరం అత్యంత కాలుష్య భరిత నగరాల్లో ఒకటి. నగరంలో పచ్చదనం ఎక్కడా కనబడదు. సుప్రీంకోర్టు ఇప్పుడు కారు షెడ్డు నిర్మాణానికి కొనసాగించవచ్చని వీలు కల్పించింది. ఇది ఆరె ప్రతిఘటనలకు ఎదురు దెబ్బ. వారి ఆశలు నీరుగారిపోయాయి. నవంబర్ 15వ తేదీన ఈ వివాదం మరోసారి విచారణకు రానుంది. ఈ సారయినా కోర్టు ఈ సమస్యను అర్ధం చేసుకుని ఆరె కాలనీ నుంచి కారు షెడ్డును మరో ప్రాంతానికి తరలించాలని చాలా మంది ఆశిస్తున్నారు.

big source of air pollution in Aarey colony

* రాజేశ్వరీ గణేశన్ ( డైలీ ఓ )