Thursday, February 22, 2024

బిగ్‌బాష్ లీగ్‌లో అరుదైన ఫీట్

- Advertisement -
- Advertisement -

Bigbash

 

ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్

అడిలైడ్: ప్రతిష్టాత్మకమైన బిగ్‌బాష్ లీగ్ (బిబిఎల్)లో బుధవారం రెండు అరుదైన అద్భుతాలు జరిగాయి. బిగ్‌బాష్ టి20 లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచుల్లో రెండు హ్యాట్రిక్‌లు నమోదయ్యాయి. అడిలైడ్ స్ట్రైకర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అఫ్గాన్ సంచలనం రషీద్ ఖాన్ సిడ్నీ సిక్సర్స్‌పై హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇదే రోజు మెల్‌బోర్న్ స్టార్స్ తరఫున ఆడుతున్న పాకిస్థాన్ బౌలర్ హారిస్ రౌఫ్ కూడా హ్యాట్రిక్ సాధించడం విశేషం. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హారిస్ ఈ అరుదైన హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు.

పాక్ స్పీడ్‌స్టర్ హారిస్ వరుసగా ఫెర్గూసన్, గిల్స్, సామ్స్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. మరోవైపు రషీద్ ఖాన్ కూడా వరుసగా మూడు బంతుల్లో వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అతను వరుస బంతుల్లో జేమ్స్ విన్సే, జోర్డాన్ సిల్క్, జాక్ ఎడ్వర్డ్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఇక, బిగ్‌బాష్ చరిత్రలోనే ఒకే రోజు రెండు హ్యాట్రిక్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) తర్వాత అంతటి ఆదరణ కలిగిన టి20 లీగ్‌గా బిగ్‌బాష్ పేరు తెచ్చుకుంది. ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఈ టోర్నీలో ప్రపంచ అగ్రశ్రేణి క్రికెటర్లు పాల్గొంటారు.

Bigbash is a rare feat in League
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News