Home తాజా వార్తలు బిగ్‌బాస్-11 సీజన్ విజేత శిల్పా షిండే..!

బిగ్‌బాస్-11 సీజన్ విజేత శిల్పా షిండే..!

Bigg-boss

ముంబై: బిగ్‌బాస్-11 టివి రియాలిటీ షోలో శిల్పా షిండే విజేతగా నిలిచింది. ఈ షోకి బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ హోస్ట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఐతే ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్‌బాస్-11 సీజన్ విన్నర్‌గా ప్రముఖ టివి నటి శిల్పా షిండే ఎంపికైంది. విన్నర్‌గా నిలిచిన శిల్పా షిండేకు బిగ్‌బాస్ ట్రోఫీతోపాటు రూ.44 లక్షల ప్రైజ్‌మనీ గిఫ్ట్‌గా అందజేశాడు సల్మాన్‌ఖాన్. ఇక బిగ్‌బాస్-11 సీజన్ లో మరో టివి నటి హీనాఖాన్ రన్నరప్‌గా ఎంపికైంది. ప్యాడ్‌మాన్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం జరిగిన బిగ్‌బాస్-11 ఫినాలే ఈవెంట్‌లో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ చీఫ్‌గెస్ట్‌గా హాజరయ్యారు. హిందీలో ప్రసారమైన బాభీ సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమ్రపాలి, సంజీవని సినిమాల్లో శిల్పా షిండే నటించింది.