Friday, April 19, 2024

ముచ్చటగొలిపే మువ్వన్నెల జండా

- Advertisement -
- Advertisement -

national-flag

తెలంగాణ రెండో ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ జూన్ 2, 2016లో 72 అడుగుల ఎత్తు జాతీయ జెండాను, హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న సంజీవయ్య పార్కులో ఆవిష్కరించారు. ఇది దేశంలోనే రెండో ఎత్తయిన జాతీయ జెండాగా నిలిచి రాష్ట్ర గౌరవాన్ని పతాక స్థాయిలో నిలిపింది. దీన్ని నిర్మించేందుకు స్టీల్ పైపులు ప్రత్యేకంగా కొల్‌కత్తా నుండి తెప్పించారు. ఈ జెండా సుమారు 65 కిలోల బరువు ఉంటుందట. దీన్ని నిర్మించేందుకు దాదాపు 3 కోట్లు ఖర్చు చేశారట. అయితే ఇది అత్యంత ఎత్తులో ఉండటం వల్ల హుస్సేన్‌సాగర్ దీని పక్కనే ఉండటంతో బలమైన గాలులు వీయడం ఈ జెండాకు ప్రతికూలంగా మారింది. ఎగురవేసిన రెండు రోజుల్లోపే జెండా చిరిగిపోయింది. మళ్లీ దాని స్థానంలో అధికారులు మరో జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. 20 రోజుల వ్యవధిలోనే మూడుసార్లు జెండాను మార్చారు. ఒక్కో పతాకం కోసం ప్రభుత్వం రూ.1.35 లక్షలను వెచ్చించింది.

Biggest national flag flies in Sanjeevaiah park

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News