Home జాతీయ వార్తలు లాహోర్ వరకు కనిపించేలా అతిపెద్ద త్రివర్ణ పతాకం

లాహోర్ వరకు కనిపించేలా అతిపెద్ద త్రివర్ణ పతాకం

national-flagఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించేందుకు సరిహద్దు భద్రతా సిబ్బంది సన్నాహాలు చేపట్టారు. పంజాబ్ లోని అట్టారీ-వాఘా సరిహద్దుల్లో 350 అడుగుల ఎత్తయిన జాతీయ జెండాను ఏర్పాటుచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఒక ప్రత్యేకత ఉంది. పాకిస్థా న్‌లోని లాహోర్ నుంచి చూస్తే ఈ జెండా కన్పించేంత ఎత్తులో దీన్ని ఆవిష్కరించనున్నట్లు బిఎస్‌ఎఫ్ పంజాబ్ ఫ్రాంటియర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ యాదవ్ తెలిపారు. వాఘా సరిహద్దుకు 18 కిలోమీటర్ల దూరంలో అమృతసర్, లాహోర్ ఉం టాయని, రెండు ప్రాంతాల నుంచి చూస్తే ఈ త్రివర్ణ పతాకం కనబడు తుందన్నారు. దేశంలో ఎత్తయిన జెండా ఇదే అవుతుందన్నారు. 2017 జనవరి నాటికి దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అంతేగాక జెండా చుట్టూ సిసిటివి ఫుటేజ్‌లను కూడా ఏర్పాటుచే యనున్నారు. ప్రస్తుతం ఎత్తయిన జెండా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంది. 293 అడుగుల ఎత్తులో ఉన్న ఈ జెండాను కేంద్ర రక్షణమంత్రి మనోహర్ పారికర్ జనవరిలో ఆవిష్కరించారు.