Home తాజా వార్తలు నితీశ్ నమ్మక ద్రోహి: లాలూ

నితీశ్ నమ్మక ద్రోహి: లాలూ

                    lalu

బీహార్: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆర్‌జెడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. పదవి కోసం నితీశ్ ఎదైనా చేస్తారని తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తన పై వచ్చిన అవినీతి ఆరోపణల వెనుక నితీశ్ హస్తం ఉందని వెల్లడించారు. దేశ ప్రజలను బిజెపి మోసం చేస్తోందని దుయ్యబట్టారు. నితీశ్ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి మోసాలను ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామని లాలూ పేర్కొన్నారు.