Home ఎడిటోరియల్ బీహార్ ప్రొహిబిషన్ రాజ్యాంగబద్ధం!

బీహార్ ప్రొహిబిషన్ రాజ్యాంగబద్ధం!

law2‘‘మాదక ద్రవ్యం తనంతట తాను విధ్వంసకారి కాదు. దానిని అరికట్టలేని విధాన నిర్ణేతల వైఫల్యమే అత్యంత ప్రమాదకారి.-‘ఐక్య రాజ్య సమితి పూర్వ ప్రధాన కార్యదర్శి, కోఫి ఆనన్. వ్యవస్థ మార్పుకు మార్గాలు రెండు. ఉన్న దాన్ని సంస్కరించడం. కొత్త దాన్ని నిర్మించడం. వ్యవస్థలు మూడు – రాజకీయ, ఆర్థిక, సామా జికాలు. మూడవ దానిలో అలవాట్లది ప్రధాన పాత్ర. మార్పు కోసం వాటిలో చేర్చుకోవలసినవి కొన్ని, మార్చుకోవలసినవి కొన్ని, వదులు కోవలసినవి కొన్ని. వదులు కోవలసిన వాటిలో మద్యపానం మొదటిది.
బీహార్ మద్యనిషేధం: ఎన్నికల వాగ్దానాలను పాలకు లు తుంగలో తొక్కుతున్న వింతకాలంలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికల వాగ్దానం మేర కు మద్యనిషేధ చట్టాన్ని చేసి అమలు పరిచారు. ప్రతి పక్ష బిజెపి ఈ చట్టాన్ని ‘నల్లచట్టం’ గా వర్ణించింది. శాసన సభను బహిష్క రించింది. బీహార్ రాష్ట్ర ’లిక్కర్ ట్రేడ్ అసోసియేషన్’ ఈ చట్టాన్ని ఆ రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానంలో సవాలు చేసింది. న్యాయమూర్తులు ఇక్బాల్ అహ్మద్ అన్సారి, నవనీతి ప్రసాద్ సింహ్‌ల పట్నా హై కోర్టు డివిజన్ బెంచ్, ఆ చట్టం చెల్లదని 30.09.2016 న తీర్పునిచ్చింది. జడ్జ్ గారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిని, ‘మద్యనిషేధం విధించని రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ బద్దంగా వ్యవహరించనట్లా?‘ అని అడిగారు. ‘అవును‘ అని చెప్పే సాహసం ఆ ప్రతి నిధి చేయలేకపోయారు. బీహార్ మధ్యనిషేధచట్టం 14, 21 రాజ్యాంగ నిబంధన లను ఉల్లంఘిస్తున్నదని పట్నా హైకోర్టు పేర్కొన్నది. ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల స్థానాన్ని ఆక్రమిస్తా యన్న భయాన్ని బయట పెట్టింది.’ చట్టసమానతను లేదా దేశంలో ఏ భాగంలో నైనా చట్టాల సమాన రక్షణను ఏ వ్యక్తికీ ప్రభుత్వం నిరాకరించరాదని’ నిబంధన 14 తెలుపుతుంది. చట్టం ద్వారా స్థిరీకరించ బడిన విధానంతో తప్ప జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ఏ వ్యక్తి కి దూరం చేయరాదు.’ అని నిబంధన 21 చెపుతుంది. మద్యనిషేధం ఈ నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నదో సామాన్యు నికి అర్థం కావడం లేదు. చట్టంలోని శిక్షలతో విభేదించిన న్యాయస్థానం, అవి రాజ్యాంగ నిబంధనలు 14, 21 లను ఉల్లంఘిస్తున్నా యన్న నెపంతో, ఏకంగా చట్టాన్నే రద్దుచేసింది. 8 వారాల తర్వాత ఈ విషయాన్ని సుప్రీం కోర్టు తేల్చబోతున్నది. సమాజాన్ని, దేశాన్ని నాశనం చేసే పదార్థాలను ప్రభు త్వాలు ప్రజలకు పంచ రాదని, అవి ప్రజలకు అందు బాటులో ఉండరాదని మాత్రమే ప్రజలకు తెలుసు. ప్రజాప్రయోజనం కోసం ప్రభుత్వాలు చేసిన చట్టాలను సారా వ్యాపార సంస్థలు సవాలు చేయడంలో వారి స్వార్థం, స్వలాభం, చట్టధి క్కార స్వభావం, జన వినాశనం ఇమిడి ఉన్నాయని అర్థమవుతున్నది. కొందరు ‘న్యాయ మూర్తులు‘ దేశ శ్రేయ స్సును ఫణంగా పెట్టి వ్యాపార వర్గాలతో కుమ్మక్క య్యారేమోనన్న అనుమాన మూ కలుగుతున్నది. హై కోర్టు తీర్పును బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీ ల్ చేసింది. పాట్నా హై కోర్టు తీర్పుపై న్యాయ మూర్తు లు దీపక్ మిశ్రా, యు.యు. లలిత్‌ల సుప్రీం కోర్టు బెంచ్ 07.10.2016 న స్టే విధింది. విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. కాని ‘దేశ మంతా మద్యపాన నిషేధాన్ని అమలుచేయాలని’ బిజెపి నాయకుడు అశ్వని ఉపాధ్యాయ్ చేసిన ప్రజా ప్రజన వ్యాజ్యాన్ని కొట్టేసింది. కేరళ ప్రభుత్వం 2014లో అంచె లంచెలుగా మద్యనిషేధాన్ని విధించాలని తీర్మా నించింది. గడువు తీరినా వందల కొద్దీ మద్య దుకాణాల అను మతులను పునరుద్ధరించలేదు. కొత్తగా ఏర్పడిన వామపక్ష ప్రభుత్వం ఈ మద్యవిధానాన్ని కొనసాగి స్తున్నది. బార్ ఓనర్లు, సారా సరఫరా సన్నగిల్లి పర్యా టక ప్రగతి పాడవుతున్నదని, కేరళ హై కోర్టులో దావా వేశారు. ‘ఏ విధానానికైనా పర్యాటక అభివృద్ధి మాత్ర మే ఉద్దేశం కారాదు. సంక్షేమం, ప్రజారోగ్యం కూడా సమాన ప్రాము ఖ్యతలే‘ అని హై కోర్టు దావాను కొట్టే సింది. సారా సాహు కార్లు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. భారత అటార్ని జనరల్ ముకుల్ రోహత్గి మద్య విక్రేతల తరఫున వాదించారు. ‘పొగాకు, మద్యాల వినియోగం మానవా రోగ్యానికి విషతుల్య మన్నది కాదనలేనిది. ప్రజావిని యోగ మద్యనిషేధం కచ్చితంగా ప్రజానుకూల ప్రయ త్నమే.‘ అన్న వ్యాఖ్యా నంతో సుప్రీం కోర్టు కేరళ హై కోర్టు తీర్పును ధృవీకరించింది. ఈ నేపథ్యంలో మద్యనిషేధంపై ప్రజలలో చర్చ, విమర్శ, విశ్లేషణ జరుగుతున్నాయి.
మద్యంపై ఆదేశిక సూత్రం: ‘ప్రజారోగ్యాన్ని మెరుగు పరచడానికి పోషకాహార విలువల స్థాయిని, జీవన ప్రమాణాలను పెంచాలి. ప్రత్యేకించి ఆరోగ్యానికి హాని కరమైన్ మత్తుపానీయాలను, మాదక ద్రవ్యాలను, ఔషధ ప్రయోజనాలకు తప్ప, నిషేధించాలి.‘ రాజ్యాం గంలో పొందుపరిచిన సంబంధిత్ ఆదేశిక సూత్రాన్ని ప్రభు త్వాలు అమలు చేయవలసిన అవసరం లేదా? అన్నది మీమాంస.
భారత్‌లో మద్యవిధానం: భారత రాజ్యాంగం 7 వ షెడ్యూల్ ప్రకారం మద్యం రాష్ట్రాల జాబితాలో చేర్చ బడింది. అందుకే మద్యవిధానం వివిధ రాష్ట్రాలలో వివిధ రూపాలలో ఉంది. దేశంలో పలు ప్రాంతాలలో విరివిగా సారా దొరుకుతున్నా కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో వివిధ రూపాలలో మద్యనిషేధం అమలులో ఉంది. మద్యం తయారీని, నిలువను, అమ్మ కాలను, తాగుడును నిషేధించిన మొదటి రాష్ట్రం గుజరాత్. బాంబె రాష్ట్రం 01.05.1960 న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు గా విభజించబడింది. ఆనాటి నుండే గుజరాత్‌లో మద్య నిషేధం విధించబడింది. అక్కడ విదేశీయులకు ఒక నెల సారా పరిమితి ఇస్తారు. గుజ రాత్ మద్యవిధానం పొరుగు రాష్ట్రాలయిన మహారాష్ట్ర, రాజస్తాన్, గోవా, డయ్యులలో మద్యవ్యాపారాన్ని విపరీతంగా పెంచింది. 1989లో మద్యపానాన్ని నిషేధించిన లాగాలాండ్ 2014 నుంచి దాన్ని ఎత్తివేయ డానికి చర్చలు జరుపుతున్నది. 1991, ఏప్రిల్ లో 5 కొండ ప్రాంతాల జిల్లాలు తప్ప మిగిలిన రాష్ట్రంలో నిషేధం విధించిన మణిపూర్ 2015 జులై లో దాన్ని ఎత్తివేయాలని ప్రయత్నం చేసింది. ‘బంగారం’ ద్వీపంలో తప్ప మిగిలిన లక్షదీప్‌లో మద్యపానం నిషే ధించబడింది. గతంలో మద్యపానాన్ని నిషేధించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, హరియాణా, మిజోరం, తమిళనాడు రాష్ట్రాలు తర్వాత మద్యపాననిషేధాన్ని ఎత్తివేశాయి. దశల వారీగా నిషేధాన్ని విధిస్తామని కేరళ ప్రభుత్వం 2014, ఆగస్టులో ప్రకటించింది. 2104, మార్చ్ నుండి ముగిసిన లైసెన్సులను పునరుద్ధరించలేదు. ఎక్కువగా సారా తాగే రాష్ట్రాలలో కేరళ ఒకటి. 2016, ఏప్రిల్ 5 నుండి బిహార్ లో మద్యపాన నిషేధం విధించ బడింది. గణతంత్ర దినం, స్వాతంత్రదినం, గాంధి జయంతి రోజులలో చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిషేధం విధించాయి. కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రాల ప్రధాన పండుగల దినాలలో, కొన్ని రాష్ట్రాలు నెలలో మొదటి రోజున నిషేధం అమలు చేస్తాయి. ఎన్నికల సందర్భంగా ముందు రోజు, మరుసటి రోజు తో సహా మద్యం నిషేధం. మద్యపానం నిషేధించని రాష్ట్రాలలో కొన్నింటిలో 18 ఏళ్ళ లోపు, కొన్నింటిలో 21 ఏళ్ళ లోపు, కొన్నింటిలో 25 ఏళ్ళ లోపు వారు తాగరాదు. మే, 2015 నాటి నివేదికలో, భారత దేశం లో, 1992 నుండి 2012 వరకు మద్యపానం 55% పెరిగిందని ప్రపం చ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ గణాంకాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ 15 ఏళ్ళు నిండి న వారినే పరిగణించింది. 15 ఏళ్ళ లోపు వారిని కూడా గణిస్తే ఈ గణాంకాలు ఘనంగా మారుతాయి. 1970 – 1995 సంవత్సరాల్ మధ్యలో మద్యపానం 106.7% పెరిగింది. రష్యా, ఎస్టోనియా తర్వాత మూడవ స్థానం మనదే. ప్రపంచీకరణ పాపాల ఫలితాలలో ఇదీ ఒకటని అర్థమవుతున్నది.
పాలక తిరోగమనం తిరస్కారయోగ్యం: అనేక అంశా లలో పాలక పక్షాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటి ఉద్దేశా లకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుంటాయి. ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ప్రజానుకూల అంశాలలో కూడా పాలక పక్షాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తాయి. బీహార్ లో బిజెపి శాసనసభను బహిష్కరించడం, కేరళ మద్య విధానం లో ప్రభుత్వ న్యాయవాది సారా వ్యాపారులకు అను కూలంగా వాదించడం ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. ప్రజాప్రయోజన అంశాలలో పక్షాలన్నీ తిరోగమనానికి తిలోదకాలివ్వాలి. విరోధాభాసానికి విడాకులివ్వాలి. ప్రజాసంక్షేమానికి పట్టం గట్టాలి.
చట్టాలు జనులకు చుట్టాలు కావాలి: న్యాయస్థానాల విచక్షణను విశ్లేషించడం ధిక్కారమవుతుందేమో!? కాని కోర్టులను బట్టి, వ్యాజ్యకారులను బట్టి, న్యాయ మూర్తుల ను బట్టి, పాలకులను బట్టి న్యాయాన్యాయా లు తారు మారు కావడం చూస్తున్నాం. న్యాయం ఒక టే అయినా అనువర్తనం అనుమానం అయింది.
చట్టాలలో రాజ్యాంగ నిబంధనలు ప్రతిబింబించాలి. అదే సమయంలో ఆదేశిక సూత్రాలకు ఉచిత ప్రాధాన్యత నివ్వాలి. ఇవి కోర్టు పరిధిలో విచారణకు రావని ప్రజా సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఎవరికైనా విశాల దృక్పథ సామాన్యజన సంక్షేమమే శిరోధార్యం. సమా జ శ్రేయస్సు చట్టాలను చేస్తున్న ప్రభుత్వాలను ప్రోత్స హించాలి. ప్రజావిశ్వాసాన్ని పెంచాలి. మద్య నిషేధ చట్టం బిహార్ దే కాదు, ఏ రాష్ట్రానిదైనా ఆదేశిక సూత్రసమ్మతమే. రాజ్యాంగబద్దమే.

 సంగిరెడ్డి హనుమంత రెడ్డి
రచయిత : అఖిల భారత అభ్యుదయ వేదిక, జాతీయ కార్యదర్శి, 9490204545