Friday, April 19, 2024

ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి

- Advertisement -
- Advertisement -

Bike silencers wrecked with road roller

1,000 బైక్ సైలెన్సర్లు రోడ్డు రోలర్‌తో ధ్వంసం
నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ రద్దు చేస్తాం
నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్

మనతెలంగాణ, హైదరాబాద్ : ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని,నిబంధనలు ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. సౌండ్ పొల్యూషన్‌పై కెబిఆర్ పార్క్ మేయిన్ గేట్ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అత్యధిక సౌండ్ వస్తున్న బైక్‌ల 1,000 సైలెన్సర్‌లను రోడ్డు రోలర్‌తో తొక్కించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ సౌండ్ పొల్యూషన్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కారు 90 డెసిబుల్, బస్సు 100 డెసిబుల్ సౌండ్‌ను విడుదల చేస్తాయని తెలిపారు. అత్యధిక సౌండ్ వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుందని, దీర్ఘకాలంలో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉంటుందని, కొన్ని సమయాల్లో మృతిచెందుతారని తెలిపారు. 25 ఏళ్లు దాటిన వారికి సౌండ్ పొల్యూషన్ వల్ల గుండెపోటు రావచ్చని అన్నారు. అలాగే ఎక్కువ శబ్దాలు వినడం వల్ల వినికిడి సమస్యలు రావచ్చని అన్నారు. ఒత్తిడి, అలసట, హిస్టీరియా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 30 డెసిబుల్ దాటితే నిద్రలేమితో బాధతపడతారని, ప్రవర్తనలో మార్పు వస్తుందని, ఉద్రేకంగా మారుతారని అన్నారు.

భారీ శబ్దాలు వినడం వల్ల మెమరీని కూడా కోల్పోవచ్చని అన్నారు. మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటి సారి రూ.1,000 జరిమానా, రెండో సారి రూ.2,000 జరిమానా విధిస్తారని తెలిపారు. నాయిస్ పొల్యుషన్ కేసులు 2019లో 4,866, 2020లో 2,163, 2021లో 12,938, ఎయిర్ పొల్యూషన్ కేసులు 2019లో 18,430, 2020లో 6,022, 2021లో 1,977కేసులు నమోదు చేశామని తెలిపారు. వాహనాలను తయారు చేసే సమయంలోనే ఎంత సౌండ్ రావాలని నిర్ణయిస్తారని, వాటిని అందరు పాటించాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువకులు సైలెన్సర్‌ను మాడిఫై చేసుకుంటనే చర్యలు తీసుకుంటామని తెలిపారు. తల్లిదండ్రుల కూడా దీనిని ఎంకరేజ్ చేయవద్దని కోరారు. సమావేశంలో ట్రాఫిక్ డిసిపిలు ఎల్‌ఎస్ చౌహాన్, ఇన్స్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News