Thursday, April 25, 2024

బైక్‌ల దొంగ అరెస్టు

- Advertisement -
- Advertisement -

10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
వివరాలు వెల్లడించిన నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి

 

మనతెలంగాణ, సిటిబ్యూరో: పార్కింగ్ చేసిన బైక్‌లను చోరీ చేస్తున్న వ్యక్తిని తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి తన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా, అశోక్‌నగర్ కాలనీకి చెందిన షేక్ రియాజుద్దిన్ గల్ఫ్‌లో పనిచేస్తున్నాడు. కామరెడ్డి జిల్లా, తడవాయి మండలం, ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన షెంకిరి శ్రీనివాస్ గౌడ్ చోరీ చేసిన బైక్‌లను రిసీవ్ చేసుకుంటున్నాడు. చింతల్‌కు చెందిన అభిమన్యు ప్రసాద్ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. విధుల్లో పాల్గొనేందుకు ఈ నెల 10వ తేదీన రైల్‌నిలయానికి వచ్చి అక్కడ బైక్‌ను పార్కింగ్ చేసి విధుల్లోకి వెళ్లాడు. పనులు ముగించుకుని వచ్చి చూసేసరికి బైక్ కన్పించలేదు. దీంతో వెంటనే తుకారాంగేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ఈ క్రమంలోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ చేయగా గతంలో చేసిన తొమ్మిది నేరాలు బయటపడ్డాయి. ఇన్స్‌స్పెక్టర్ ఎల్లప్ప, డిఐ ఆంజనేయులు తదితరులు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News