Home జాతీయ వార్తలు బైకర్ నెత్తిన ట్రాఫిక్ చలాన్ల పిడుగు

బైకర్ నెత్తిన ట్రాఫిక్ చలాన్ల పిడుగు

Bikerచండీగఢ్: ఇటీవల కాలంలో ఒక్క ట్రాఫిక్ చలాన్‌కే ప్రజలు బెంబేలెత్తిపోతుంటే 189 చలాన్లు పెండింగ్‌లో ఉన్న ఈ 21 ఏళ్ల యువకుడి పరిస్థితి ఏమిటో మీరే ఊహించండి. చండీగఢ్‌కు చెందిన సంజీవ్ ఒక ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఒక టూవీలర్ ఉంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి 2017-2019 మధ్య కాలంలో అతనికి మొత్తం 189 ఇ-చలాన్లు జారీ అయ్యాయి. ఈ ఏడాది జూలై 26న తప్పుగా యు-టర్న్ తీసుకున్న నేరానికి సంబంధించి ఒక చలాన్ జారీ కావడంతో పెండింగ్ చలాన్ల ఉదంతం బయటపడింది.

తప్పుగా యు-టర్న్ తీసుకున్నందుకు రూ. 300 జరిమానా అతనికి విధించారు. ఇది కట్టడానికి చండీగఢ్ జిల్లా కోర్టుకు వెళ్లగా అతని పేరు మీద టూవీలర్ పైన 189 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించి ప్రజలు, పోలీసులు ఫోటోలు తీయడమో, సిసిటివి కెమెరా ఫుటేజ్‌ల ద్వారా గుర్తించడమో జరిగినవే. తాను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తానని, కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత మరింత జాగ్రత్తగా ఉన్నానని సంజీవ్ చెబుతున్నాడు. ఏడాదిన్నర క్రితం తాను సెకండ్ హ్యాండ్ బైక్ కొన్నానని, మరి ఇన్ని చలాన్లు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో తనకే అర్థం కావడం లేదని అతను వాపోతున్నాడు. వాస్తవానికి పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు. వీటిని అమ్మడం లేదా బదిలీ చేయడానికి వీలు ఉండదు. వాటి పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్లు కూడా ఇవ్వడానికి సాధ్యపడదు.

Biker stumped on finding 189 challans pending against him in Chandigarh In a similar case in July, a 23-year-old milkman came to know that he has been challaned 36 times for riding without helmet in seven months. All the offences were captured by the same CCTV camera.