Tuesday, April 23, 2024

బికినీలో కరోనా రోగులకు సేవలు….

- Advertisement -
- Advertisement -

 

మాస్కో: ఓ నర్సు కరోనా రోగులకు బికినీ ధరించి వైద్యం అందిస్తోంది. దీంతో కరోనా రోగులతో పాటు ఆస్పత్రి సిబ్బంది ఆశ్చర్యపోయారు. ప్రతి రోజు నర్సు డ్రెస్ వేసుకోవడంతో పిపిఇ కిట్లు దరించడంతో ఉడకపోస్తుండడంతో ఓ నర్సు వెరైటీగా ఆలోచించింది. గత 40 రోజుల నుంచి ఇబ్బందిగా ఉందని అందుకు నర్సు డ్రెస్ వేసుకోకుండా పిపిఇ కిట్లను మాత్రమే ధరిస్తున్నానని ఆ నర్సు చెప్పుకొచ్చింది. కరోనా రోగులు ఈ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. దీంతో ఆ దేశ ఆరోగ్య శాఖ ఆ నర్సును విధుల నుంచి తొలగించింది. ఈ సంఘటన రష్యాలోని మాస్కోలో జరిగింది. ప్రస్తుతం రష్యాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రష్యాలో కరోనా బాధితుల సంఖ్య 3.17 లక్షలకు చేరుకోగా 3100 మంది చనిపోయారు. అమెరికాలో కరోనా రోగులు దాదాపుగా 16 లక్షలకు చేరుకోగా 95 వేల మంది మృత్యువాతపడ్డారు. ప్రపంచంలో కరోనా వైరస్ 51 లక్షల మందికి సోకగా 3.3 లక్షల మంది మరణించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News