Wednesday, March 29, 2023

డాక్టర్ బిల్లీగ్రాహం ఇకలేరు!

- Advertisement -

Billi100

అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన క్రైస్తవ మత ప్రబోధకుడు, సదరన్ బాప్టిస్టు సంఘాల స్థాపకుడు డాక్టర్ బిల్లీగ్రాహం (100) మృతిచెందారు. భారత కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 7 గంటల సమయంలో ఉత్తర కెరోలీనాలోని మోన్ట్రీట్ లోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నట్లు ‘ఫాక్స్ న్యూస్’ ఏజెన్సీ ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధికంగా పేరుగాంచిన పది మందిలో బిల్లీగ్రాహం ఒక్కరు. 1918 నవంబర్ 7న చార్లోటే నగరంలో జన్మించిన డాక్టర్ గ్రహం 1949నుండి క్రైస్తవ ప్రబోధకుడిగా ఆయన పరిచర్యను ప్రారంభించి ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచారు.
తన సభల ద్వారా వచ్చిన డబ్బులతో ప్రపంచంలోని నలుమూలల పేద, మధ్య తరగతికి చెందిన బాలబాలికలకు సమరిటైన్ బాక్సులను అందించారు. భారతదేశాన్ని ఎంతో ఇష్టపడేవారని ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన ‘నేషనల్ ప్రేయర్ డే’సభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కుమార్తె అన్నీగ్రాహం తెలిపింది. హెబ్రోన్ చర్చ్ వ్యవస్థాపకులు బ్రదర్ భక్త్ సింగ్ తో బిల్లీగ్రాహంకు స్నేహ సంబంధాలుండేవి.

billy-graham

దివిసీమ బాధితులకు చేయూత:  1977లో వచ్చిన వరధల్లో సర్వస్వం కోల్పోయిన దివిసీమ బాధితులకు డాక్టర్ బిల్లీ గ్రహం చేయూతనిచ్చారు. బట్టలు, నిత్యావసరాలతోపాటు ఆరోగ్య సేవలను ఆయన అందించారు. వరదల్లో ఇండ్లను కోల్పోయిన నిర్వాసితుల కోసం రాజమండ్రి ప్రాంతంలో ఓ కాలనీ కట్టించి తన సేవను చాటుకున్నారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మర్రి చెన్నారెడ్డి డాక్టర్ బిల్లీ గ్రహం చేసిన సేవలకు గాను హర్షం వ్యక్తం చేశారు.

డోనాల్డ్ ట్రంప్ సంతాపం:
డాక్టర్ బిల్లీ గ్రహం మృతిపట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారు. బిల్లీగ్రాహం ఓ ప్రత్యేక వ్యక్తి. ఆయన లేని లోటు క్రైస్తవులతోపాటు అన్ని మతాలవారికి తీరనిలోటని ట్రంప్ ట్వీటర్ ద్వారా తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్, మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జీబుష్, హిల్లరీక్లింటన్ తదితరులు బిల్లీగ్రహం మృతిపట్ల సంతాపం తెలిపారు.

Billy Graham, American evangelist and counselor to presidents, dead at age 100

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News