Home తాజా వార్తలు రేపటి కోసం నేడు

రేపటి కోసం నేడు

BioAsia Conference

 

ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అగ్రగామిగా హైదరాబాద్
వచ్చే ఫిబ్రవరిలో బయో ఏషియా సదస్సు
భాగస్వామిగా స్విట్జర్లాండ్, సంయుక్త భాగస్వామిగా జర్మనీ, అసోం, కేరళ రాష్ట్రాలు
పాల్గొననున్న 55 దేశాలకు చెందిన 1800 మంది నిపుణులు,100 కంపెనీలు
స్టార్టప్‌ల కోసం ప్రత్యేక కార్యక్రమం
బయోఏషియా-2020 వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్ వెల్లడి

హైదరాబాద్ : లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ నగర స్థానాన్ని మరింత సుస్థిరం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇప్పటికే లైఫ్ సైన్సెస్ ఫార్మా రంగానికి హైదరాబాద్ నగరం రాజధానిగా ఉందని ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా మరియు లైఫ్ సైన్సెస్ రంగ అభివృద్ధి జరిగేలా పలు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బుధవారం బయో ఏషియా సమావేశ నేపథ్యాన్ని మంత్రి ప్రకటించారు. టుడే ఫర్ టుమారో అనే నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతుందని తెలిపారు.

ఇప్పటికే ప్రపంచంలోని ప్రఖ్యాత లైఫ్ సైన్సెస్ కార్యక్రమాల్లో బయో ఏషియా ఒకటిగా నిలిచిందని, ఈ సమావేశానికి దేశ, విదేశాల నుంచి ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు ప్రతినిధులు హాజరవుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లైఫ్ సైన్సెస్ రాజధానిగా ఎదగడంలో బయో ఆసియా సదస్సు కీలకంగా నిలిచిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ఈరోజు టిఎస్‌ఐఐసి కార్యాలయంలో బయో ఏషియా2020 వెబ్ సైట్ ని మంత్రి ప్రారంభించారు. ఈసారి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరగనున్న బయో ఏషియా సమావేశానికి స్విట్జర్లాండ్ భాగస్వామి దేశం గా ఉన్నదని, జర్మనీ సంయుక్త భాగస్వామిగా ఉన్నదని, అసోం, కేరళ రాష్ట్రాలు రాష్ట్ర భాగస్వాములుగా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు తెలిపారు.

ఈసారి జరగనున్న సమావేశానికి సుమారు 55 దేశాల నుంచి 1800 మంది ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగ నిపుణులు ప్రతినిధులు హాజరు కానున్నట్లు మంత్రి కెటిఆర్ తెలిపారు. బయో ఏషియా సదస్సులో స్టార్టప్ల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు, ఈసారి సుమారుగా 100 కు పైగా కంపెనీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టిఎస్ ఐఐసి ఎండి నరసింహారెడ్డి, లైఫ్ సైన్సెస్ డైరెక్టర్ శక్తి నాగప్పన్ పాల్గొన్నారు.

BioAsia Conference next February