Home తాజా వార్తలు ఫ్లైఒవర్ కారు ప్రమాద కేసు.. పోలీసులకు చుక్కెదురు

ఫ్లైఒవర్ కారు ప్రమాద కేసు.. పోలీసులకు చుక్కెదురు

Biodiversity Car Accident, HC

హైదరాబాద్:బయోడైవర్సిటి ఫ్లైఒవర్ కారు ప్రమాదం కేసులో రాయదుర్గం పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కృష్ణ మిలన్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. కృష్ణ మిలన్‌రావును జనవరి 3వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని న్యాయస్థానం ఈ సందర్భంగా పోలీసులను ఆదేశించింది. కారు యాక్సిడెంట్ చేసిన వ్యక్తిపై 304(2) సెక్షన్ ఎలా పెడతారని రాయదుర్గం పోలీసులను ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. కృష్ణమిలన్‌రావు నిర్లక్ష్యంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. నిందితుడు అధికవేగంతో దూసుకెళ్లినందునే ఈ ప్రమాదం జరిగినట్లు ఆధారాలు సేకరించామన్నారు. అంతకుముందు నిందితుడిని డిసెంబర్ 12వ తేదీ వరకు అరెస్ట్ చేయరాదని కోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే.

Biodiversity Case: HC Orders not to Arrest Car Driver