Home రాష్ట్ర వార్తలు మత్స కార్మికులకు మరిన్ని బయోమెట్రిక్ కార్డులు

మత్స కార్మికులకు మరిన్ని బయోమెట్రిక్ కార్డులు

555దక్షిణాది ప్రాంతీయ మండలి భేటీలో నాలుగు అంశాలపై అంగీకారం

విజయవాడలో శనివారంనాడు జరిగిన దక్షిణాది ప్రాంతీయ మండలి 26వ సమావేశంలో కేంద్ర హోంమంత్రి
విజయవాడ: మత్సకారులకు మరిన్ని బయోమెట్రిక్ కార్డు లను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపా రు. జాలర్ల భద్రతకు అత్యధిక ప్రాధాన్యను కల్పిస్తామని పేర్కొన్నారు. దక్షిణా ది రాష్ట్రాల సమస్యలపై విశ్లేషించుకుని,పరిష్కారాలను కనుగొనేందుకు దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి 26వ సమావేశాలను శనివారం ప్రారంభి స్తూ హోంమంత్రి మాట్లాడారు. ఇక్కడి గేట్‌వే హోటల్‌లో సమావేశం జరి గింది. రైల్వేలైన్ల ఏర్పాటు వ్యయం అంశాన్ని మరోమారు పరిశీలించుకోవల్సి ఉందని , అదే విధంగా నక్సల్స్ ప్రభావిత నిర్థిష్ట ప్రాంతాలలో భద్రతా వ్యయ పంపిణీ, తీరప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేయడం వంటి పలు అం శాలు కీలకంగా ప్రస్తావనకు వచ్చాయి. సరైన సమన్వయం, సహకారంతోనే కీలక సమస్యల పరిష్కారానికి సమావేశానికి అధ్యక్షత వహించిన రాజ్‌నాథ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తమిళ నాడు నుంచి ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం, తెలంగాణ తరఫున హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ పాల్గొన్నారు. కర్నా టక హోంమంత్రి జి పరమేశ్వర, కేరళ నుంచి మంత్రి జోసెఫ్ ఇతరులు హాజ రయ్యారు. గతంలో జరిగిన మండలి సమావేశాల నుంచి ఇప్పటివరకు మొ త్తం ఎనిమిది అంశాలలో కేవలం నాలుగు పరిష్కారం అయ్యాయని, ఈసారి సమావేశాలలో పేదరిక నిర్మూలన పథకాలకు కేంద్రం నిధుల గురించి తమి ళనాడు కోరిందని, దీనిపై మంత్రుల స్థాయి బృందం పరిశీలన జరపాల్సి ఉందని సమావేశం తరువాత హోంశాఖ అధికారి ఒకరు వివరించారు. మత్సకారుల భద్రత అత్యంత కీలకమైన అంశం అని, కేంద్రం ఈ విష యంలో వారికి బయోమెట్రిక్ కార్డులను జారీ చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు. నక్సల్స్ సమస్య పరిష్కారానికి మరిన్ని కేం ద్ర బలగాల అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు కోరాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల కూడళ్లలో సమస్య తీవ్రతను ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులు తెలిపారు. రైల్వేలైన్ల వేగవంతా నికి సంబంధిత రాష్ట్రాలు 50 శాతం నిధులను పెట్టుకోవాలనే రైల్వే శాఖ విధాన సమీక్ష అవసరం అని అన్ని రాష్ట్రాలు కోరాయి. వామపక్ష తీవ్రవాదం నుంచి దేశం పలు కీలక సమస్యలను ఎదుర్కొంటోందని, వీటిని రాష్ట్రాలు సంఘటితంగా ఎదుర్కోవాల్సి ఉందని హోంమంత్రి కోరారని అధికార వర్గాలు తెలిపాయి. సహకార సమాఖ్య విధానంతోనే దేశ ప్రగతి వేగవంతం అవుతుం దని పేర్కొన్నాయి. ప్రాంతీయ మండళ్లకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తుందని కేంద్రం హామీ ఇచ్చింది. సమావేశ ప్రారంభానికి ముందు చెన్నై వరద అంశాన్ని ప్రస్తావించుకుని, చెన్నైలో మృతుల కుటుంబా లకు సంతాపం తెలిపారు.  అనంతరం సమావేశంలో తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ జాతీయ భద్రత విషయంలో రాష్ట్రాల సమన్వయం దిశలో కేంద్రం చర్యలు కీలకమని ఆయన తెలిపారు. నక్సల్స్ సమస్య పరిష్కారానికి కేంద్రం నుంచి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి సరైన రీతిలో సహకారం కోరుకుంటున్నామని హోమంత్రి పేర్కొన్నారు. విద్యుత్ ఇతర అపరిష్కృత అంశాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చర్చల ప్రక్రియను పాటిస్తాయని చెప్పారు.రాజ్‌నాథ్ సింగ్, ఎపి సిఎం చంద్రబాబు, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తదితరులు