*నిర్మల్ కలెక్టర్ ఎం.ప్రశాంతి
మన తెలంగాణ/నిర్మల్‌అర్బన్ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ప్రశాంతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్‌లో ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాం తాల నుండి వచ్చిన ప్రజల నుంచి ఆమె అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ఆమె సమీక్షించారు. ప్రతీ శాఖ తమకు వచ్చిన దరఖాస్తులను వారంలోగా పరిష్క రించాలన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, వచ్చిన దానిలో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెం డింగ్‌లో ఉన్నాయి, అదే విధంగా పెండింగ్‌లో ఉన్న వాటికి కారణాలు తెలుపాలని ఆదేశించారు. స్వచ్ఛ భారత్‌లో భాగంగా జిల్లా అధికారులకు కేటాయించిన లక్షం మేరకు వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలపై ఎప్పటిక ప్పుడు పర్యవేక్షించి నివేదికలు సమర్పించాలన్నారు. హరితహారంలో నిర్థేశించిన లక్షం మేరకు అధి కారులు వెంటనే మొక్కలు నాటి స్థలాల వివరాలను అందజేయాలన్నారు. ప్రజాఫిర్యాదుల విభాగంలో వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిసి శిహెచ్ శివలింగయ్య, డిఆర్‌ఒ రమేష్ రాథోడ్, ఆర్‌డిఒ ప్రసునాంబా, జిల్లావైద్యాధికారి జలపతినాయక్, జిల్లా వ్యవసాయ అధికారి అమ్రేష్ కుమార్, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సురేష్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.