Home తాజా వార్తలు త్వరలో ఆర్తీ అగర్వాల్ బయోపిక్

త్వరలో ఆర్తీ అగర్వాల్ బయోపిక్

Biopic On Actress Aarthi Agarwal In Tollywoodహైదరాబాద్ : టాలీవుడ్ లో పలు రంగాలకు చెందిన ప్రముఖుల బయోపిక్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే సావిత్రి, ఎన్ టిఆర్, వైస్ ల బయోపిక్ లు టాలీవుడ్ లో రూపొందాయి. ఇదిలా ఉండగా దివంగత హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ బయోపిక్ రూపొందనుందన్న వార్తలు టాలీవుడ్ లో వస్తున్నాయి. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఆర్తీ అగర్వాల్ టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ గా రాణించారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్, మమేశ్, ఎన్ టిఆర్, ప్రభాస్ తదితర హీరోలతో నటించి ఆర్తీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆమె ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత లక్ బ్రేకప్ కావడంతో ఆమె అమెరికా సెటిలయ్యారు. కొంతకాలం తర్వాత ఆర్తీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. అయితే బరువు తగ్గడానికి ఆమె లైపో ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ వికటించి ఆమె చనిపోయారు. ఈ క్రమంలోనే ఆర్తీ అగర్వాల్ బయోపిక్ ను తెరకెక్కించేందుకు ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.