వాషింగ్టన్ : జీవం పుట్టుకకు సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను నాసా వెల్లడించింది. భూమిపై జీవం పుట్టుకపై ఒక్కొక్కరిది ఒక్కొ వాదాన. ఇప్పటివరకు మీక్టరిగా ఉన్న ఈ అంశంపై దశబ్దాలుగా పరిశోదనాలు చేస్తున్న నాసా కొత్త విషయని తెరపైకి తెచ్చింది. భౌతిక వాతారణ మార్పులతో సహజ సిద్ధంగా జీవం పుట్టుందని బావిస్తున్న మనకు జీవశాస్తవేతలు అనేక సిద్దంతాలు చెప్పారు. కాగా.. తాజా నాసా తెరపైకి తెచ్చిన అంశం కాస్త ఆసక్తికరంగా ఉంది. భూమిపై జీవం పుట్టుకకు చందమామే కారణమని నాసా అధ్వర్యంలో జరిగిన ఓ పరిశోధనలో తెలింది. 450 కోట్ల ఏళ్ల క్రితం భూమిపై జీవం పుట్టుకకు చంద్రడి అయస్కాంత క్షేత్రం ఎంతో ఉపయోగపడ్డిందని సైన్స్ అడ్వాన్స్ లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడించింది. అంటున్నారు. కొన్ని వేల ఏండ్ల క్రితం భూమికి 80 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడు, సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ ను అడ్డుకోవడంతో భూమిపై జీవం ఏర్పడిందని నాసా అభిప్రాయపడింది.
సూర్య కుటుంబం ఏర్పాడిన కొత్తలో భూమికి చంద్రమామ చాలా దగ్గరలోనే ఉంది. ప్రస్తుతం 2.38 లక్షల కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయింది. కాని కొన్ని వేల ఏండ్ల క్రితం 80 వేల కిలోమీటర్ల దూరంలోనే ఉండేదని, దాదాపు 450 కోట్ల ఏండ్లకు ముందు రాతిగోళంలా ఉన్న భూమి సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ భూమిని మృతి గ్రహంగా ఉంచేది. కాని 410 కోట్ల ఏండ్ల నుంచి 350 కోట్ల ఏండ్ల మద్య సూర్యడి నుంచి వచ్చే ఈ రేడిషన్ ను చండ్రడి అయస్కాంత క్షేత్రం అడ్డుకోవడం ప్రారంభించడంతో భూమిపై క్రమంగా వాతావరణం ఏర్పాడం మొదలైంది. అలా జీవం పుట్టుకకు భూమిపై అనుకూల వాతావరణం ఏర్పడిందని నాసా శాస్తవేతలు తెలపారు.