Home తాజా వార్తలు కవితకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

కవితకు జన్మదిన శుభాకాంక్షల వెల్లువ

MP Kavithaహైద‌రాబాద్: టిఆర్ఎస్ ఎంపి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు క‌ల్వ‌కుంట్ల‌ కవిత జన్మదినం సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కవితకు ఆమె తండ్రి , తెలంగాణ సిఎం కెసిఆర్, ఆమె సోదరుడు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్ఎ హరీష్ రావుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నామని వారు ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయా దేశాల్లో కవిత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Birthday Wishes to MP Kavitha