Home తాజా వార్తలు ఒమిక్రాన్ దెబ్బకు బిట్ కాయిన్ విలవిల

ఒమిక్రాన్ దెబ్బకు బిట్ కాయిన్ విలవిల

Bitcoin plunges over 20% amid omicron volatility

 

11 శాతం పడిపోయిన విలువ

సింగపూర్ : గత ఏడాది కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్న వేళ మెరుపులు కురిపించిన ప్రధాన కిప్టోకరెన్సీ బిట్ కాయిన్.. ఇప్పుడు కొత్త వేరియంట్‌తో విలవిలలాడిపోతోంది. బిట్ కాయిన్‌తో పాటు ఇతర క్రిప్టో కరెన్సీ కాయిన్‌లు కూడా భారీగా నష్టపోయాయి. సింగపూర్‌లో శనివారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ ఏకంగా 11 శాతం నష్టపోయింది.42,296 డాలర్ల దిగువకు చేరుకున్న బిట్‌కాయిన్ మధ్యాహ్నం 1.50 గంటల సమయానికి 47,600 డాలర్ల వద్దకు చేరుకుంది. మరో వైపు క్రిప్టోలో రెండో స్థానంలో ఉన్న ఎథిరియం 17.4 శాతం నష్టపోయి తిరిగి 10 శాతం పూడ్చుకుంది.

శనివారం ఒక్క రోజే క్రిప్టో కరెన్సీ విలువ 2.2 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు ట్రాకర్ కాయిన్ జెకో పేర్కొంది. గత నెల 10న 68,950 డాలర్లతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించిన బిట్‌కాయిన్ విలువ సుమారు 21 వేల డాలర్లు పడిపోయింది. ఒమిక్రాన్ ప్రభావంపై స్పష్టమైన అంచనాలు లేకపోవడంతో మార్కెట్‌లో అస్థిరత నెలకొంది. అయితే ఇంతకు ముందు ఆర్థిక అస్థిరతల సమయంలో క్రిప్టో కరెన్సీలు పుంజుకునేవి. కానీ ఇప్పుడు ఒమిక్రాన్‌పై ఆందోళనలతో మదుపరులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇతర ఆస్తులు, పెట్టుబడులతో పోలిస్తే క్రిప్టో కరెన్సీలపై ఎక్కువరాబడే వచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పటికేబిట్ కాయిన్‌ను చట్టబద్ధమైన కరెన్సీగా ప్రకటించిన ఎల్ సాల్వడార్ మరిన్ని కాయిన్‌లను నాణేలను కొనుగోలు చేసింది.

Bitcoin plunges over 20% amid omicron volatility