Home ఆఫ్ బీట్ ఈ కాకర కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు

ఈ కాకర కాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు

Bitter Gourd

 

ముస్తాబాద్ : ఈ కాకరకాయలను మన తెలంగాణలో బోడకాకర కాయలు అంటారు. కాకర కాయ జాతికి చెందినదే ఈ కాకరకాయలు. కుకుర్చిటేసి కుటుంబానికి చెందినది ఈ కాకరకాయలు. ఈ కాకరకాయలు అడవిలో వర్షకాలంలో పుష్కలంగా దొరకుతాయి. మంచిరుచిని కూడా కలిగి ఉంటాయి. వీటిని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు పట్టణాల్లో వీటికి మంచి గిరాకి ఉండటం వలన పట్టణాలకు సైతం తరలించి అమ్ముతుంటారు. జీర్ణవ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు ఇవి ఎంతగానో తోడ్పడతాయి. వంద గ్రాముల బోడ కాకరకాయ ముక్కల్లో చాలా తక్కువ సంఖ్యలో కేలరీలుంటాయి.

గర్భీణీలకు ఈ కాకరకాయ చాలా మేలు చేస్తుంది.దీనిలో ఉండే ఫొలేట్‌లు శరిరంలో కొత్త కణాల వృద్దికి గర్భస్థ శిశువు ఎదుగుదలకూ తోడ్పడుతుంది.మధుమేహంతో బాదపడే వారికి ఈ కాకరకాయ మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర శాతాన్ని క్రమబద్దీకరిస్తుంది. తరచూ తీసుకోవడం వల్ల దీనిలోని పోషకాలు శరీరంలో ఏర్పడే కాన్సర్ కారకాలను నాశనం చేస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. బోడ కాకరకాయలోని విటమిన్ సి శరీరంలోని ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే విటమిన్ ఎ కంటి చూపునకు మేలు చేస్తుంది. మూత్రపిండాల సమస్యలున్నావారు ఈ కూరకు ఎంత ప్రాధాన్యమిస్తే అంతమంచిది.

Bitter Gourd is good for health