Home తాజా వార్తలు బిజెపి ప్రజలకు ద్రోహం చేసింది : రాహుల్

బిజెపి ప్రజలకు ద్రోహం చేసింది : రాహుల్

RAHUL

న్యూఢిల్లీ : మూడేళ్ల పాలనలో బిజెపి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, పేలవ ప్రదర్శనతో ప్రజలకు ద్రోహం చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ సర్కారు మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా నిర్వహించనున్న సంబరాలపై ఆయన ట్విట్టర్ ద్వారా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ‘ఉద్యోగాల కోసం యువత నిరీక్షిస్తున్నారు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. దేశ సరిహద్దుల్లో సైనికులు బలవుతున్నారు. మరి ప్రభుత్వం ఏం సంబురాలు చేస్తుందని’ రాహుల్ ట్వీట్ చేశారు. మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా భాజపా మోదీ ఫెస్ట్‌ పేరుతో సంబరాలను నిర్వహించనున్నారన్న విషయం తెలిసిందే.