Home జాతీయ వార్తలు పెంచిన పెట్రోల్ ధరల్ని వెనక్కి తీసుకోవాలి

పెంచిన పెట్రోల్ ధరల్ని వెనక్కి తీసుకోవాలి

BJP Govt extorting people with fuel price says Sonia

 

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజల్ని దోపిడీ చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. మార్చి 25 లాక్‌డౌన్ తర్వాత 22సార్లు ఇంధనం ధరలు పెంచినట్టు ఆమె గుర్తు చేశారు. పెంచిన ధరల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరల పెంపుకు నిరసనగా సోమవారం దేశవ్యాప్త ప్రచార కారక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగా సోనియాగాంధీ తన వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. ఓవైపు కరోనా వల్ల సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న ప్రజలపై ధరల భారం మోపడమేమిటని ఆమె ప్రశ్నించారు.

మోడీ ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన తర్వాత అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గాయని, ఇప్పటి వరకూ 12సార్లు ఎక్సైజ్ పన్ను పెంచిందని ఆమె గుర్తు చేశారు. దీంతో, ప్రభుత్వానికి రూ.18 లక్షల కోట్ల అదనపు ఆదాయం సమకూరిందని ఆమె తెలిపారు. రాహుల్, ప్రియాంకగాంధీలు కూడా సోషల్ మీడియా ద్వారా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ధరలు తగ్గించేలా కేంద్రంపై ఒత్తిడి చేయాలని వారు పిలుపునిచ్చారు.

BJP Govt extorting people with fuel price says Sonia