Home Default బిజెపికి ఓటమి ఖాయం: ప్రియాంకా గాంధీ

బిజెపికి ఓటమి ఖాయం: ప్రియాంకా గాంధీ

Priyanka-Gandhi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి పార్టీకి ఓటమి ఖాయమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ జోస్యం చెప్పారు. ఆదివారం జరుగుతున్న ఆరో దశ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ప్రియాంకా గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడాతూ.. కేంద్ర ప్రభుత్వం పై ప్రజల్లో ఆగ్రహం ఉంని, ప్రభుత్వ తీరుతో వారు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఆమె అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అసలైన సమస్యల గురించి మాట్లాడకుండా ఇతర విషయాల గురించి మాట్లాడుతున్నారు. దీంతో ప్రజలు ప్రభుత్వంపై ఉన్న తమ ఆగ్రహాన్ని ఈ ఎన్నికల్లో ఓట్ల రూపంలో చూపిస్తారని ఆమె అన్నారు.మన దేశ పరిస్థితులు బాగుపడడానికి నేను ఈ రోజు నా ఓటు హక్కును వినియోగించుకున్నాను’ అని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు.

BJP govt is going Priyanka Gandhi after casting vote