Thursday, March 28, 2024

ఉద్యోగాల విషయంలో బిజెపి అబద్ధాలు చెబుతోంది: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

BJP is lying about jobs: Harish Rao

 

హైదరాబాద్: బిజెపి నేత రాంచంద్రర్ రావుకు ఓటమి తప్పదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్ నాయకులు దూకుడు పెంచుతున్నారు. మహబూబ్‌నగర్-హైదరాబాద్-రంగారెడ్డి పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల టిఆర్‌ఎస్ అభ్యర్థి సురభివాణీదేవి గ్రాడ్యుయేట్లతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో వాణిదేవికి అపార అనుభవం ఉందన్నారు. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని బిజెపి ప్రభుత్వం నెరవేర్చలేదని, ఉద్యోగాల విషయంలో బిజెపి అబద్ధాలు చెబుతోందన్నారు. టిఆర్‌ఎస్ పాలన దేశానికే ఆదర్శంగా ఉందని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News