Home జాతీయ వార్తలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిజెపి : రాహుల్

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిజెపి : రాహుల్

rahul-gandhi

ఢిల్లీ : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ధనబలం అణగదొక్కిందని ఆరోపించారు. యుపిలో పోలరైజేషన్ కారణంగా తాము ఓటమి పాలయ్యామని పేర్కొన్నారు. పంజాబ్‌లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. గోవా, మణిపూర్‌లలో దొడ్డిదారిన బిజెపి అధికారంలోకి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజార్టీ సీట్లు సాధించిన తమ కాంగ్రెస్‌ను కాదని ఆ రెండు రాష్ట్రాల గవర్నర్లు బిజెపిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం సిగ్గు చేటని ఆయన పేర్కొన్నారు.