Home తాజా వార్తలు తెల్కపల్లి ఎస్‌ఐపై ఢిల్లీలో ఫిర్యాదు

తెల్కపల్లి ఎస్‌ఐపై ఢిల్లీలో ఫిర్యాదు

హైదరాబాద్: బిజెపి పార్టీ కార్యాకర్తలను నాగర్‌కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి ఎస్‌ఐ వెంకటేశ్ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని బిజెపి నాయకుడు దిలీపాచారీ జాతీయ బిసి కమిషన్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఎలాంటి పక్షపాతం లేకుండా విధులు నిర్వహించాల్సిన సదరు ఎస్‌ఐ అక్రమ కేసులు బనాయిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్‌ఐను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందించాలని నాగర్‌కర్నూల్ జిల్లా ఎస్‌పి ఆదేశాలు జారీ చేసింది.

BJP Leader Delipachari files complaint on Telkapally SI