Saturday, April 20, 2024

కేసుల మూసివేతలో తెలంగాణ అగ్రస్థానం : లక్ష్మణ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : అవినీతి కేసుల మూసివేతలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని బిజెపి ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపి లక్ష్మణ్ అన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టిఎస్ పిఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద స్కామ్ జరిగితే చిన్న ఉద్యోగులను అరెస్టు చేసి చేతులు దులుపుకొంటున్నారని విమర్శించారు. గ్రూప్- 1 పరీక్షపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

పోటీ పరీక్షలను ఆలస్యం చేసి యువతను మళ్ళీ మభ్యపెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి లీకేజీలు కొత్త కాదు. 2018లో ప్రశ్నపత్రం లీకైంది. ఆ తర్వాత ఎంసెట్ పరీక్ష పేపర్ లీకైంది. ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారు. ఫలితంగా ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని లక్ష్మణ్ గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News