Home జాతీయ వార్తలు ఢిల్లీ తూర్పు నుంచి గౌతమ్ గంభీర్‌ నామినేషన్

ఢిల్లీ తూర్పు నుంచి గౌతమ్ గంభీర్‌ నామినేషన్

 

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇటీవల బిజెపి పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మే 12వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గంభీర్‌ను ఢిల్లీ తూర్పు నియోజక వర్గం నుంచి బరిలోకి దింపుతున్నట్లు బిజెపి సోమవారం వెల్లడించింది. ఈ మేరకు గంభీర్ ఢిల్లీ తూర్పు నియోజకవర్గానికి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గంభీర్ మీడియాతో మాట్లాడారు. ‘నా దేశానికి నా వంతుగా సేవ చేయాలనుకుంటున్నానని, ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాను’ అని తెలిపారు.

BJP leader Gautam Gambhir files nomination