Thursday, March 28, 2024

అమ్మాయిలు శూర్పణలా ఉన్నారు: బిజెపి నేత వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: వర్తమాన కాలంలో మహిళల వస్త్రధారణపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ రోజుల్లో మహిళల వస్త్రధారణను రావణాసురుడి చెల్లెలు శూర్పణఖతో ఆయన పోల్చారు. హనుమాన్ జయంతి జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ రోజుల్లో మహిళల వస్త్రధారణ చూసిన తర్వాత తనకు వారిలో దేవతామూర్తుల రూపం కనిపించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
మద్యం మత్తులో తూలుతూ చిందులేసి అమ్మాయిలు, అబ్బాయిలను చూసినపుడు వాళ్ల మత్తు దిగేలా వాళ్ల చెంపలపై చెళ్లుమని ఐదారుసార్లు కొట్టాలని అనిపిస్తుంటందని వర్గీయ చెప్పారు.

నేను నిజమే చెబుతున్నాను. దేవుడి మీద ఒట్టేసి చెబుతున్నా..హనుమాన్ జయంతి నాడు అబద్ధం చెప్పను. ఆడపిల్లలు వేసుకునే బట్టలను చూసిన తర్వాత వాళ్లను దేవతలుగా ఎన్నటికీ భావించలేము..వాళ్లలో నాకు దేవతామూర్తులు కనపడడం లేదు..శూర్పణఖలా కనపడతారు..అంటూ వర్గీయ వ్యాఖ్యానించారు.భగవంతుడు వారికి అందమైన దేహాన్ని ఇచ్చాడు..కనీసం కొన్ని మంచి దుస్తులైనా వేసుకోవాలి అంటూ ఆయన హితవు పలికారు.
కాగా..విజయ్ వర్గీయ వ్యాఖ్యలను మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఎటువంటి వస్త్రాలు ధరించాలో మహిళల ఇష్టమని, ఇందులో బిజెపి నాయకుల జోక్యమేంటని మహిళా సంఘాలు ప్రశ్నించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News