Home మహబూబ్‌నగర్ హరీశ్ అవినీతిని బట్టబయలు చేస్తా: నాగం

హరీశ్ అవినీతిని బట్టబయలు చేస్తా: నాగం

Nagam-Janardhan-Reddyమన తెలంగాణ/మహబూబ్‌నగర్ అర్బన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల పథకాలలో సంబంధిత శాఖ మంత్రి హరీశ్‌రావు అవినీతిని బట్టబయలు చేస్తామని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రాజెక్టుల విషయంలో మంత్రి హరీశ్‌రావు అవినీతిపై పై కోర్టులకు వెళ్తామన్నారు. ‘అవినీతిపై కోర్టును ఆశ్రయించడం తప్పా. నేనేమైనా మీ ప్రాజెక్టుల పనులకు అడ్డుపడ్డానా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఫస్ట్ లిప్టు కుడికిళ్ల గ్రామ స్థులకు, రైతులకు నోటీసులు లేకుండానే అర్ధరాత్రి వరకు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారన్నారు. పాలమూరు-రంగారెడ్డి పథకానికి చెందిన ల్యాండ్ అక్టివేషన్ కేవలం 29 శాతం మాత్రమే పూర్తయిందని, 18 ప్యాకేజీలలో 7 నుంచి 8 ప్యాకేజీలను సుమారుగా 0 శాతం ఉన్నాయన్నారు. ప్రభుత్వం ప్రజలు, రైతులను దోపిడీ చేస్తుందని విమర్శించారు. హరీశ్‌రావును మంత్రి పదవి నుంచి తొలగించే వరకు పోరాడతామన్నారు. ఈ అవినీతిలో సిఎం కెసిఆర్ కూడా అర్హుడన్నారు. కేవలం జిఒ నెం.146ను అడ్డం పెట్టుకొని సుమారు రూ.3 వేల కోట్ల అవినీతి చేయాలనుకుంటున్నారని, వారం రోజుల్లో  మిషన్ భగీరథపై అవినీతిని తేలుస్తామన్నారు.