Friday, April 19, 2024

టిఎంసిలో చేరిన మరో బిజెపి ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

BJP MLA Krishna Kalyani Joins TMC

కోల్‌కత: ప్రతిపక్ష బిజెపి నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా.. బిజెపి ఎమెల్యే కృష్ణ కల్యాణి బుధవారం టిఎంసిలో చేరారు. ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టిఎంసి గెలుపొంది అధికారం చేపట్టిన తర్వాత అధికార పార్టీలోకి ఫిరాయించిన బిజెపి ఎమ్మెల్యేలలో రాయగంజ్ ఎమ్మెల్యే కృష్ణ కల్యాణి ఐదవ వ్యక్తి. గతంలో ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాకు టిఎంసి అధ్యక్షుడిగా పనిచేసిన కృష్ణ అసెంబ్లీ ఎన్నికల ముందు బిజెపిలో చేరి రాయగంజ్ నుంచి బరిలో నిలిచారు. గత కొంత కాలంగా మాజీ కేంద్ర దేబశ్రీ చౌదరితో కృష్ణకు విభేదాలు కొనసాగుతున్నాయి. ఆత్మగౌరవం ఉన్న ఎవరూ బిజెపిలో పనిచేయలేరని టిఎంసిలో చేరిన సందర్భంగా కృష్ణ కల్యాణి విలేకరుల వద్ద వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News