Home జాతీయ వార్తలు కానిస్టేబుల్ పై బిజెపి మహిళా ఎంపి దాడి…

కానిస్టేబుల్ పై బిజెపి మహిళా ఎంపి దాడి…

Rekha-Varma

ఉత్తర్ ప్రదేశ్: పోలీసు కానిస్టేబుల్ పై బిజెపి మహిళా ఎంపి దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..పోలీస్ కానిస్టేబుల్ శ్యాంసింగ్  బిజెపి మహిళా ఎంపి రేఖావర్మ వద్ద ఎస్కార్టుగా పని చేస్తున్నారు. ఓ కార్యక్రమానికి ఎంపి రేఖావర్మ వెళ్లగా శ్యాంసింగ్ భద్రతా విధులు నిర్వర్తించారు. విధులు ముగించుకొని తిరిగి వెళ్తుండగా ఎంపి రేఖావర్మ పిలిచి తనని అకారణంగా కొట్టారని శ్యాంసింగ్ పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తనపై చేయి చేసుకున్న ఎంపిపై తగిన చర్య తీసుకొవాలని, తనకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను శ్యాంసింగ్ కొరారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

BJP MP Rekha Varma slaps constable in UP