Saturday, April 20, 2024

పైసలతో ఎన్నికలు నడుస్తున్నాయని: ఈటల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డబ్బులిస్తేనే ఓటు వేస్తామనే పరిస్థితి మారకపోతే ప్రమాదమని, ఎన్నికల్లో పైసల సంస్కృతి పోవాలని ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను రకరకాలుగా ప్రలోభ పెట్టడంతో చివరకు ఓటర్లు డబ్బుల కోసం రోడ్లు ఎక్కే పరిస్థితి రావడం ఆందోళనకంగా మారిందన్నారు. మంగళవారం ఢిల్లీలో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దేశంలోని రాజకీయ పరిస్థితులపై రాజకీయ తీర్మానాన్ని ఈటల ప్రవేశపెట్టి మాట్లాడారు.. ప్రజలను నమ్ముకుని నాయకులు ఎన్నికలకు వెళ్తున్నారని అన్నారు. అయితే తెలంగాణలో మాత్రం పైసలతో ఎన్నికలు నడుస్తున్నాయని ఆయన అన్నారు.

ప్రస్తుతం అవుతున్న ఎన్నికల ఖర్చు చూసి ఎంఎల్‌ఎగా పోటీ చేయాలంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ ఇచ్చే ముందు మీరు ఎంతవరకు ఎన్నికల కోసం ఖర్చు పెట్టగలరని పార్టీలు అడుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితి మారాలన్నారు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత కూడా ప్రభుత్వ పథకాలను ప్రకటిస్తున్నారని ఆయన తెలిపారు. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని ఓటర్లను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News