Home తాజా వార్తలు ప్రెస్ మీట్ కి వెళ్లిన విలేకరుల జేబులు ఖాళీ

ప్రెస్ మీట్ కి వెళ్లిన విలేకరుల జేబులు ఖాళీ

BJP new office inaugurated by bandi sanjay at nagar kurnool

 

నాగర్ కర్నూల్ : స్థానిక బిజెపి కార్యాలయంలో తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రెస్ మీట్ కి వెళ్ళిన పలువురు విలేకరుల జేబులు ఖాళీ అయ్యాయి. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు బండి సంజయ్ ప్రెస్ మీట్ కు విలేకరులు హాజరయ్యారు. నాగర్ కర్నూల్ జిల్లాలో బిజెపి జిల్లా కార్యాలయం ప్రారంభించిన అనంతరం బండి సంజయ్ ప్రెస్ మీట్ కు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు గుంపులుగా ఉండడం వల్ల ప్రెస్ మీట్ కి వెళ్లిన విలేకరుల జేబులలోని డబ్బులు చోరీకి గురవడం జరిగింది. ఓ రిపోర్టర్ జేబులో నుండి 6వేల రూపాయలు చోరీ చేయగా, మరో రిపోర్టర్ జేబు లో నుండి 18 వందల రూపాయలు, ద్విచక్ర వాహన తాళంచెవి ని దొంగలించారు. ప్రెస్ మీట్ అనంతరం జేబులు తడుముకో గా డబ్బులు, ద్విచక్ర వాహన తాళం చెవి పోయిందని గమనించుకొని విలేకరులు లోలోన మదన పడుతున్నారు.

BJP new office inaugurated by bandi sanjay at nagar kurnool