Home తాజా వార్తలు కోతలు, వాతలు తప్ప బిజెపి చేసిందేమీ లేదు: హరీష్ రావు

కోతలు, వాతలు తప్ప బిజెపి చేసిందేమీ లేదు: హరీష్ రావు

BJP no work for people

సంగారెడ్డి: బలం లేకపోయినా కాంగ్రెస్ పోటీలో ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. పటాన్ చెరులో మెదక్ స్థానిక సంస్థల సన్నాహక సమావేశంలో హరీష్ రావు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలకు 500 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. క్రూడాయిల్ ధరలు తగ్గినా పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచడంతో ప్రజలపై భారం పడిందన్నారు. కోతలు, వాతలు తప్ప ప్రజలకు బిజెపి చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ధాన్యం కొనుగోలుపై పెద్ద మాటలు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వడ్లు ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంఎల్‌ఎ గూడెం మహిపాల్ రెడ్డి, టిఆర్‌ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి పాల్గొన్నారు.