Saturday, April 20, 2024

రజనీకాంత్ వెంట బిజెపి సంబంధీకులు..

- Advertisement -
- Advertisement -

రజనీకాంత్ వెంట బిజెపి సంబంధీకులు
రజనీ కొత్త పార్టీపై కాంగ్రెస్

BJP People associated with Rajinikanth: Congress

బెంగళూరు: తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ త్వరలో ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ ప్రభావం రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందో ఇప్పుడే అంచనా వేయలేమని, ఆ పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు, ఎన్నికల కార్యాచరణపై ఎటువంటి స్పష్టత లేదని కాంగ్రెస్ అభిప్రాయపడింది. ప్రస్తుతం రజనీకాంత్ వెంట బిజెపికి చెందిన చాలా మంది ఉన్నారని కాంగ్రెస్ తమిళనాడు వ్యవహారాల ఇన్‌చార్జ్ దినేష్ గుండూరావు వ్యాఖ్యానించారు. రజనీకాంత్ ఏర్పాటు చేయనున్న పార్టీ ఇంకా రిజిస్టర్ కాలేదని, ఆయన పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలు తెలియవని, వచ్చే ఏడాది జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందా లేక వేరే పార్టీతో పొత్తు కుదుర్చుకుంటుందా వంటి విషయాలపై ఎటువంటి స్పష్టత లేదని శనివారం ఆయన వ్యాఖ్యానించారు. ఆ విషయాలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఆ పార్టీ ప్రభావంపై అంచనాకు రాగలమని ఆయన అన్నారు. ఆ పార్టీ స్వరూపమేంటి, ఆయన ఏం చేయదలచుకున్నారు, ఆయన బిజెపితో చేతులు కలుపుతారా వంటి విషయాలకు సమాధానాలు రావలసి ఉన్నదని దినేష్ గుండూరావు చెప్పారు.

BJP People associated with Rajinikanth: Congress

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News