Wednesday, April 24, 2024

బట్టలు సరిచేస్తేనే సినిమా విడుదల

- Advertisement -
- Advertisement -
దీపికా షారూక్ పఠాన్‌కు బిజెపి హెచ్చరిక

భోపాల్ : దుస్తులు సరిచేసుకోండి లేకపోతే మధ్యప్రదేశ్‌లో మీ సినిమా నడవదని ప్రముఖ నటి దీపికా పడుకోణేకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా హెచ్చరికలు వెలువరించారు. బాలీవుడ్ హీరో షారూక్‌ఖాన్‌తో కలిసి పడుకోనే నటిస్తోన్న పఠాన్ సినిమాలోని ఓ పాట యాడ్ విడుదలైన దశలో ఇందులో దీపిక భంగిమపై మధ్యప్రదేశ్ మంత్రి రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి హోదాలో మిశ్రా ఘాటుగా స్పందించారు.

చాలా కాలం గ్యాప్ తరువాత హీరో షారూక్ సినిమా పఠాన్ భారీ అంచనాల నడుమ జనవరి 25న విడుదల కానుంది. ఈ దశలో సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవలే ఇందులోని బేషరమ్ రంగ్ పాట సన్నివేశాలు విడుదల అయ్యాయి. ఇందులో దీపిక బికినీ డ్రస్సు , బీచ్‌లో ఈ పాట చిత్రీకరణ దృశ్యాలపై హోం మంత్రి స్పందించారు. ఇటువంటి దృశ్యాలను వెంటనే సరిదిద్దుకోవల్సి ఉంటుంది. లేకపోతే ఈ సినిమా ప్రదర్శన సంబంధిత విషయంపై తాము నిర్ణయం తీసుకుంటామని బిజెపి పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్ర హోం మంత్రి ప్రకటించారు.

BJP warns Deepika Shah Rukh Pathanదీపిక దేశంలోని తుక్‌డే తుక్‌డే గ్యాంగ్ మద్దతుదారు అని, ఈ విషయం జెఎన్‌ఎ కేసులో స్పష్టం అయిందని మంత్రి తెలిపారు. హీరోయిన్ వేసుకున్న బికినీ చాలా అభ్యంతరకరంగా ఉంది, ఈ పాట చిత్రీకరణ పూర్తిగా మలినమైన ఆలోచనలు మైండ్‌తో తీసినట్లు ఉందని మంత్రి విమర్శించారు. ఇటువంటి రెచ్చగొట్టే, చెడగొట్టే వైఖరిని మధ్యప్రదేశ్‌లోకి అనుమతించేది లేదన్నారు. బురదపట్టినట్లున్న బుర్రల వారి వైఖరి ఇది అని హోం మంత్రి మండిపడ్డారు. ముందు హీరోయిన్ దుస్తులు సవరించి తరువాత పాట చిత్రీకరించండి లేకపోతే సినిమా విడుదల అవుతుందా? లేదా అనేది ఆలోచించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News