Friday, March 29, 2024

బిజెపికి ఇప్పట్లో తిరుగులేదు

- Advertisement -
- Advertisement -
BJP won't go anywhere for many decades Says Prashant Kishor
ఈ వాస్తవం రాహుల్ గుర్తించడు
ఇదే ఆయనతో జటిల సమస్య
మోడీ బలం ఏమిటనేది గుర్తించాలి
30 శాతం ఓట్ల పార్టీ శక్తివంతమే
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
కాంగ్రెస్ తొలి నాళ్ల ఘట్టంలో కమలం

న్యూఢిల్లీ : సమస్య అంతా రాహుల్ గాంధీతోనే అని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గోవాలో వ్యాఖ్యానించారు. అధికారం , అనధికారంతో నిమిత్తం లేకుండా బిజెపి జాతీయ రాజకీయాలలో కేంద్ర బిందువుగా ఉంటుంది. బిజెపి ఎక్కడికి పోదు, అయితే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ వాస్తవికతను గుర్తించకపోవడమే అసలు సమస్య అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ప్రశాంత్ కాంగ్రెస్ ప్రవేశ యత్నాల సంప్రదింపులు ఇప్పటికైతే నిలిచిపోయినట్లే అనే విషయం ఆయన మాటలతో నిర్థారణ అయింది. ప్రశాంత్ వాస్తవికతల తూటా నేరుగా రాహుల్‌కు తగిలింది. ప్రశాంత్ ప్రశ్నలు సమాధానాల కార్యక్రమం భాగం ఇప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. ‘బిజెపి ఇప్పటిలాగానే ఇక ముందు కూడా దేశ రాజకీయాలలో కీలకంగానే ఉంటుంది. ఎన్నికలలో గెలుపు ఓటములతో సంబంధం లేకుండాఉంటుంది.

కాంగ్రెస్‌కు తొలి 40 ఏళ్ల కాలం వంటిదే ఇప్పుడు బిజెపి దశగా ఉంటుంది. బిజెపి ఎటూ పోదు. ఒక్కసారి ఏ పార్టీ అయితే 30 శాతానికి పైగా ఓట్లను దక్కించుకుంటుందో దేశంలో ఆ పార్టీకి చాలా కాలం వరకూ తిరుగుండదు. ఉన్నట్లుండి అటువంటి పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయని అనుకోవడం భ్రమే అవుతుది. దీనిని రాహుల్ ఒక్కరే కాదు అంతా గుర్తించాల్సి ఉంటుంది. అయితే ఈ వాస్తవాన్ని రాహుల్ గమనించినా గుర్తించకపోవడం ప్రధాన సమస్య అవుతోంది. ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహం చెందుతున్నారు, దీనితో వారు మోడీని అధికారం నుంచి దించేస్తారు అనే మాటల ఊబిలో కూరుకుపోరాదు. బిజెపి ఉండనే ఉంటుంది. ఇక్కడ బలంగా నిలిచేందుకు వారు వచ్చారు. మరికొన్ని దశాబ్దాల పాటు అయినా రాజకీయ స్థిరత్వానికి ఉనికిని చాటుకోవడానికి అవసరం అయిన బలం బిజెపికి ఉంది. ఉన్నట్లుండి బలీయమైన ముద్రలు చెరిగిపోవు’ అని వ్యాఖ్యానించారు. తన వీడియోలోని క్లిప్పింగ్స్‌లోని అంశాలనే గోవాలో ప్రశాంత్ తెలియచేశారు.

రాహుల్ భ్రమల్లో ఉన్నారు

అతి కొద్ది కాలంలోనే ప్రజలు మోడీని ఇంటికిపంపిస్తారని, అధికార వ్యతిరేకత ఉందని రాహుల్ భావిస్తున్నారు. త్వరలోనే బిజెపి పతనం, మోడీ పడిపోవడం ఖాయం అని రాహుల్ కలగంటున్నట్లుగా ఉందని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అయితే ఇది జరిగే పనికాదని ఆయన గ్రహించాల్సి ఉందన్నారు. ముందు రాహుల్ వాస్తవాలను గ్రహించాలి. ప్రధాని మోడీ బలం ఎంత? అనేది పరిగణనలోకి తీసుకోవాలి, బలహీనతల కోణం వైపే చూస్తే అది భ్రమే అవుతుందని ప్రశాంత్ వ్యాఖ్యానించారు. ఓ భావన అందులోనూ అవాస్తవికత, అనవసరపు భ్రమలకు గురి అయ్యి, ఇందులోనే పడిపోతూ ఉంటూ ఎవరైనా ఆయనను (మోడీని) దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.

టిఎంసి ప్రచారకర్తగా గోవాకు

బెంగాల్ సిఎం మమత బెనర్జీ పార్టీ టిఎంసికి గోవాలో ఎన్నికల ప్రచార వ్యూహాల ఖరారు పనిలో భాగంగా ప్రశాంత్ చాలారోజులుగా గోవాలో ఉంటున్నారు. ఈ తీర ప్రాంత రాష్ట్రంలో ఉనికిని చాటుకునేందుకు టిఎంసి యత్నిస్తోంది. బిజెపికి చెందిన అజయ్ షెరావత్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాల క్లిప్‌ను సోషల్ మీడియాలో పెట్టారు. బిజెపి జాతీయ రాజకీయాలలో ఏళ్ల తరబడి ఉంటుంది, మోడీ వన్నె తగ్గేది లేదని ఈ వ్యూహకర్త అభిప్రాయాలతోనే స్పష్టం అయింది. ఇక అమిత్ షా ఇంతకు ముందు పలుసార్లు ఇదే విషయాన్ని చెపుతూ వచ్చారని ఈ బిజెపి నేత ఈ నేపథ్యంలో తెలిపారు. గోవాకు టిఎంసి వ్యూహకర్తగా వచ్చిన ప్రశాంత్ కిషోర్ బిజెపికి తిరుగులేదని చెపుతూ వెలువరించిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాలలో సార్వత్రిక సంచలనానికి దారితీశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News